Jathi Ratnalu movie : పాన్ ఇండియా స్టార్ చేతులమీదుగా విడుదల కానున్న జాతిరత్నాలు ట్రైలర్..
Jathi Ratnalu Trailer Update : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా జాతిరత్నాలు. శ్రీనివాస ఆత్రేయతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్.
Jathi Ratnalu Trailer Update : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా జాతిరత్నాలు. శ్రీనివాస ఆత్రేయతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకున్నాడు నవీన్ పొలిశెట్టి.
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద డబ్బులు బాగానే వసులుచేసుకుంది. దాంతో నవీన్ చేసే తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారి జాతిరత్నాలు సినిమాను నిర్మసితున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా తెరకెక్కింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
నవీన్ పొలిశెట్టి కమెడియన్స్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా ఈసినిమా రూపొందింది. ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సినిమాతో నూతన దర్శకుడు కే.వి అనుదీప్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమానుంచి విడుదలైన చిట్టి అనే సాంగ్ సంచనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ప్రేక్షకులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతిరత్నాలు ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేస్తున్నారు. ఈ విషయం కూడా స్వయంగా నాగ్ అశ్విన్ ప్రకటించాడు. అలాగే హీరో నవీన్ కూడా ట్రైలర్ అప్డేట్ పైన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో వైపు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Keerthy Suresh : టాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మహానటి.
Venky Kudumula: డైరెక్టర్ వెంకీ కుడుములకే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.66 వేలకు టోకరా