AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venky Kudumula: డైరెక్టర్‌ వెంకీ కుడుములకే మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు.. రూ.66 వేలకు టోకరా

Venky Kudumula: నితిన్‌ నటించిన భీష్మ సినిమా పేరు చెప్పి ఆ సినిమా డైరెక్టర్‌ వెంకీ కుడుములకు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. త్వరలో జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆ సినిమా ..

Venky Kudumula: డైరెక్టర్‌ వెంకీ కుడుములకే మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు.. రూ.66 వేలకు టోకరా
Subhash Goud
|

Updated on: Mar 03, 2021 | 12:20 AM

Share

Venky Kudumula: నితిన్‌ నటించిన భీష్మ సినిమా పేరు చెప్పి ఆ సినిమా డైరెక్టర్‌ వెంకీ కుడుములకు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. త్వరలో జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆ సినిమా నామినేట్‌ చేస్తామంటూ నమ్మబలికి రూ.66 వేలకు టోకరా వేశారు. దీంతో వెంకీ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ డైరెక్షన్‌లో వచ్చిన ‘భీష్మ’ మూవీ అద్భుతంగా ఉందని చెప్పాడు. దీనిని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరిల్లో నామినేట్‌ చేయాల‌ని నిర్ణయించామని పేర్కొన్నారు.

అయితే తాను ఆ ప్యాన్‌లో కీలక సభ్యుడినని, గోప్యత వహించాల్సిన కారణంగా రహస్యంగా మీకు ఫోన్‌ చేయాల్సి వచ్చిందని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్‌లో నామినేట్‌ చేయడానికి ఒక్కో కేటగిరికి రూ.11 వేల చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. ఈ మోసగాళ్ల మాయ మాటలు విన్న వెంకీ కుడుముల డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. అందుకు మోసగాడు ఓ బ్యాంకు ఖాతా వివరాలు తెలుపగా, సైబర్‌ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన డైరెక్టర్‌ వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు అకౌంట్‌లోకి పంపినట్లు చెప్పారు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు మరో కొత్త కథ అల్లాడు.

ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్‌ విషయంలో చిన్న పొరపాటు జరిగిపోయిందని, అందుకు మీరు క్షమించాలని చెప్పుకొచ్చాడు. వాటిని సరి చేయడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ కుడుముల.. సదరు చిత్ర నిర్మాత నామినేషన్‌ పర్వం వద్దంటున్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశాడు. అనుమానం వచ్చి మోసం తెలుసుకున్నాడు. దీనిపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేరగాడు వినియోగించిన ఫోన్‌ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా సినీ రంగంలోనే కాకుండా ఎన్నో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంకుల నుంచి అంటూ, క్రెడిట్‌ కార్డు నుంచి అంటూ మరేవో అంటూ సైబర్‌ నేరగాళ్లు అమాయకులను ఆసరా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ నమ్మవద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా.. నమ్మి నిలువునా మోసపోతున్నారు. పోలీసులు కూడా సైబర్‌ నేరగాళ్లను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు పోలీసు స్టేషన్‌లలో కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి.ఇప్పటికే ఇలాంటి కేసులను పోలీసులు ఎన్నో చేధించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మోసాలకు పాల్పడుతున్న మూఠాలను పట్టుకున్న సందర్భాలున్నాయి.

ఇవి చదవండి :

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

Anasuya: ఐటెం సాంగ్‌కు సరికొత్త అర్థం చెప్పిన అందాల యాంకర్‌.. నెటిజెన్‌కు క్లాస్‌ పీకిన అనసూయ..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత