AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: ఐటెం సాంగ్‌కు సరికొత్త అర్థం చెప్పిన అందాల యాంకర్‌.. నెటిజెన్‌కు క్లాస్‌ పీకిన అనసూయ..

Anasuya Comments On Item Song: యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. వెండి తెరపై తళుక్కుమంటోంది అందాల యాంకర్‌ అనసూయ. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ..

Anasuya: ఐటెం సాంగ్‌కు సరికొత్త అర్థం చెప్పిన అందాల యాంకర్‌.. నెటిజెన్‌కు క్లాస్‌ పీకిన అనసూయ..
Narender Vaitla
|

Updated on: Mar 03, 2021 | 12:11 PM

Share

Anasuya Comments On Item Song: యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. వెండి తెరపై తళుక్కుమంటోంది అందాల యాంకర్‌ అనసూయ. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ‘పైన పటారం.. లోన లొటారం’ అనే సాంగ్‌లో తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్‌ వేదికగా ఈ పాటపై ఓ నెటిజెన్‌కు క్లాస్‌ పీకింది. వివరాల్లోకి వెళితే.. ‘పైన పటారం.. లోన లొటారం’ పాట యూట్యూబ్‌ లింక్‌ను పోస్ట్‌ చేసిన ఓ నెటిజెన్‌.. ‘ఐటెం సాంగ్‌ను చేయను అన్నారు కదా. మరి ఇదేంటి అండి. అయినా ఆ లిరిక్స్‌ ఏంటి’ అంటూ కామెంట్‌ పెట్టాడు. దీంతో చిర్రెత్తుకుపోయిన అనసూయ సదరు నెటిజెన్‌కు క్లాస్‌ పీకారు. సదరు వ్యక్తి ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘హల్లో.. అది ఐటెం సాంగ్‌ కాదు. అసలు ‘ఐటెం’ సాంగ్‌ అనేది ఏదీ లేదమ్మ.. ఒక పాటకు ఉన్న క్యాస్ట్‌ కాకుండా స్పెషల్‌గా ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు స్పెషల్‌ సాంగ్‌ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా ట్రీట్‌ చేసేవాళ్లు.. ఇచ్చిన పేరు అది. అంతేకాకుండా.. ఆ లిరిక్స్‌ వల్లే నేను ఈ స్పెషల్‌ సాంగ్‌ ఒప్పుకున్నాను’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల చేయనున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. ఆషూరెడ్డి దిమ్మతిరిగే సమాధానం.. ట్వీట్ వైరల్.!

ముంబైలో నడి రోడ్డుపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కారును అడ్డగించిన రైతు, ఆ తరువాత

Box Office Collection Drop : కరోనా నామ సంవత్సరం బాక్సాఫీస్‌కు షాక్.. ఎంతమేర నష్టపోయింది అంటే

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా