Box Office Collection Drop : కరోనా నామ సంవత్సరం బాక్సాఫీస్‌కు షాక్.. ఎంతమేర నష్టపోయింది అంటే
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ దీని ప్రభావం సినిమా రంగంపై కూడా పడింది. గత ఏడాది సినిమ విడుదల గణనీయంగా తగ్గాయి. అందుకనే కలెక్షన్ల పతనానికి కారణం అని చెప్పవచ్చు...
Box Office Collection Drop : అంతకుముందు సంవత్సరాలలో పోలిస్తే 2020లో భారత చిత్ర పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు 85 శాతం తగ్గాయి. 2020 లో బాక్సాఫీస్ వసూళ్లు రూ .861 కోట్లుగా ఉండగా, 2019 లో రూ .5,613 కోట్లుగా ఉంది దీంతో కలెక్షన్లు 85 శాతం మేర తగ్గాయి. వాస్తవానికి, కేర్ రేటింగ్స్ నివేదిక ప్రకారం, 2018 లో రూ .4,422 కోట్ల నుండి, 309 వసూళ్లు 30 శాతం పెరిగాయి. అయితే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ దీని ప్రభావం సినిమా రంగంపై కూడా పడింది. గత ఏడాది సినిమ విడుదల గణనీయంగా తగ్గాయి. అందుకనే కలెక్షన్ల పతనానికి కారణం అని చెప్పవచ్చు. గత ఏడాది 7 సినిమాలు నవంబర్ 15 మరియు డిసెంబర్ 25 మధ్య విడుదలయ్యాయి. అప్పుడు రూ .36 కోట్ల ఆదాయం లభించింది. అయితే మిగిలిన 68 చిత్రాలు జనవరి 1 నుంచి మార్చి 13 మధ్య విడుదలై రూ. 825 కోట్లను బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల రాబట్టింది. అయితే 2019 లో 246 సినిమాలు రూ .5,613 కోట్ల కలెక్షన్లు సాధించాయి.
చలన చిత్ర నిర్మాణం, పంపిణీ మరియు వినోద పరిశ్రమలోని 44 కంపెనీల ఆర్థిక స్థితిని లెక్కలోకి తీసుకుంటే. థియేటర్స్ మొత్తం వ్యయం కూడా దాదాపు మూడు వంతులు తగ్గింది. కరోనా సమయంలో థియేటర్స్ క్లోజ్ చేయడంతో ఉద్యోగులను తొలగించడం జీతాల తగ్గింపు, విద్యుత్, నీటి ఛార్జీలు తగ్గింపు వంటి కారణంతో థియేటర్స్ ఖర్చులు తగ్గాయి.
మహమ్మారి కారణంగా సంబంధిత లీజు ఒప్పందాల్లో పలు మార్పు చోటు చేసుకున్నాయి. ఇక అద్దె , రెవెన్యూ షేర్ పోస్ట్ ఓపెనింగ్ తగ్గించడం వలన అద్దె , సాధారణ సౌకర్యాల ఛార్జీలు కూడా లేవు అయితే లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ.. 2020 అక్టోబర్ 15 నుండి 50 శాతం సిటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకుల కోసం సినిమా థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, సినిమాలను తిరిగి తెరవడం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానుసారం జరిగింది. ప్రేక్షకాదరణ పొందుతాయి అనే సినిమాలు ఇంకా రిలీజ్ డేట్స్ ప్రకటించకపోవడంతో ఇప్పటికీ, చాలా మంది సినీ నిర్మాతలు థియేటర్ విడుదల విషయంలో సుఖంగా లేరు.
Also Read: