Pawan Kalyan: మరో అప్‌డేట్ ఇవ్వనున్న ‘వకీల్ సాబ్’.. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, రాజకీయాల్లో బిజీగా మారిన పవన్..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ మళ్లీ సినిమాల్లోకి రానుండడంతో ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. ఒకేసారి ఏకంగా మూడు సినిమాలను ప్రకటించి అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీలోనూ సందడి వాతావరణాన్ని తీసుకొచ్చారు పవన్. ఇక మరికొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రేక్షకులను మొదటగా ఆకట్టుకోవడానికి వస్తోన్న చిత్రం వకీల్ సాబ్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం తదనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పాలి. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ పవన్ అభిమానుల కోసం మరో ట్రీట్‌ను సిద్ధం చేసింది. బుధవారం వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘సత్వమేవ జయతే’ అనే చరణంతో మొదలుకానున్న ఈ పాటను మార్చి 3వ తేదీని సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్‌రాజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఫొటోలో వెనకాల మహాత్మా గాంధీ ఫొటో ఉండగా లాయర్‌గా పవన్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
#SathyamevaJayathe Lyrical Song frm Powerstar @PawanKalyan’s #VakeelSaab will be out on 3rd March 5PM A @MusicThaman Musical #VakeelSaabOnApril9th #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @BayViewProjOffl @BoneyKapoor @adityamusic pic.twitter.com/dK3vfxMtJY
— Dil Raju (@DilRajuofficial) March 2, 2021