PSPK New Movie : పవన్ కళ్యాణ్ తో సినిమా కథ ను రెడీ చేస్తోన్న రచయిత.. డైరెక్షన్ కు సై అంటున్న జక్కన్న..?

మూడేళ్ళ తర్వాత మేకప్ వేసుకున్న పవన్ కళ్యణ్ వరస సినిమాలతో కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. దింతో కరోనా మాసం తరువాత పవన్ మాసం నడుస్తుందా అన్నట్లు ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే వకీల్ సాబ్‌ సినిమాను...

PSPK New Movie : పవన్ కళ్యాణ్ తో సినిమా కథ ను రెడీ చేస్తోన్న రచయిత.. డైరెక్షన్ కు సై అంటున్న జక్కన్న..?
Follow us

|

Updated on: Mar 02, 2021 | 5:15 PM

PSPK New Movie : మూడేళ్ళ తర్వాత మేకప్ వేసుకున్న పవన్ కళ్యణ్ వరస సినిమాలతో కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. దింతో కరోనా మాసం తరువాత పవన్ మాసం నడుస్తుందా అన్నట్లు ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే వకీల్ సాబ్‌ సినిమాను పూర్తి చేసిన పవన్‌.. వెంటనే క్రిష్ ‌ డైరెక్షన్‌లో హిస్టారికల్ మూవీని స్టార్ట్‌ చేసేశాడు.. దానితో పాటు సైమన్‌టేనియస్‌గా అయ్యపన్‌ కొషియమ్‌ రీమేక్ షూట్‌ను కూడా పరిగెత్తిస్తున్నాడు.

మరో సినిమా బండ్ల గణేష్ తో చేయాల్సి ఉంది.. ఇక ఈ సినిమాలే కాదన్నట్టు.. ఇక నెక్ట్‌ బాహుబలి రైటర్‌తో చేయి కలిపాడట. ఈ టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. అవును స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ పవన్‌ కోసం ఓ స్టోరీని సిద్దం చేస్తున్నాడట. ఇక ఈ స్టోరీని పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్‌ చేయబోతున్నాడట. ఇందుకు సంబంధిచిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

అయితే పవన్‌కు కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ చాలా కాలంగా అనుకుంటున్నారంట. ఈ మేరకు ఇటీవల తన ఐడియాను పవన్‌కు చెప్పడంతో వెంటనే కథను సిద్దం చేయమని పవన్ అన్నారంట. అతి త్వరలోనే కథను పూర్తి చేసుకొని విజయేంద్ర ప్రసాద్ మరోసారి పవన్‌కు వినిపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే తన తండ్రి రాసిన స్టోరీల్లో ఎక్కవ స్టోరీలు రాజమౌళే సినిమాలుగా తీశారు. అసలే పవన్‌ కోసం ప్రిపేర్‌ చేస్తున్న కథ కాబట్టి కొంచెం లేట్‌ అయినా.. రాజమౌళియే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:

 పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్‌లో రిలీజ్ డేట్ వచ్చేసిందిగా

అత్తగారితో నమ్మకం మీదనే నమ్మకం పోయిందంటున్న వంటలక్క