Karthika Deepam Vantalakka : అత్తగారితో నమ్మకం మీదనే నమ్మకం పోయిందంటున్న వంటలక్క
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మార్చి 2)న 975 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం.
Kaarthika Deepam : బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మార్చి 2)న 975 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం. ఈరోజు 975 వ ఎపిసోడ్ ప్రసారం కానున్నది. ఈ నేపథ్యంలో నేడు ఏం జరగనుందో తెలుసుకుందాం..!
సౌందర్య తాను విరాట్ గురించి కార్తీక్ కి చెప్పడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని దీప ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో దీప తను అత్తగారింటికి వెళ్లే సమయం వచ్చింది. ఏ చీర కట్టుకోనూ అని ఆలోచిస్తుంది. అదే సమయంలో అత్తగారు దీప దగ్గరకు చేరుకుంటుంది. సౌందర్య ను చూసి దీప నవ్వుతూ.. సంబరంగా.. చెప్పారా..? విన్నారా? నమ్మారా? నమ్మే ఉంటారులే.. సరిగానే చెప్పారా? వినే ఉంటారులే.. అని అడుగుతుంటే.. సౌందర్య ముభావంగా.. చెప్పాను.. పట్టించుకోలేదు.. వినిపించుకోలేదు.. నాకు అస్సలు సమాధానమే చెప్పలేదు రాస్కెల్ అని కోడలు ముందు తన బాధను వ్యక్తం చేస్తుంది.
అయినా నేను భార్య భర్తల మధ్య అనవసరంగా తలదూర్చాను. నేను ఏం చెప్పినా తాను ఇప్పుడు నమ్మే స్టేజ్ లో లేడు అంటుంది సౌందర్య. దీప ఏడుస్తూ.. మీరు చెబితే నమ్మని మీ సుపుత్రుడు ఇంక ఎవరు చెబితే నమ్ముతారు. ఆయన వినే ఉంటారు.. నమ్మలేదు.. పట్టించుకోలేదు.. నమ్మనప్పుడు సమాధానం ఏం చెబుతారు. హిమ అడిగితే పట్టించుకోనట్లు.. మీరు చెప్పినా అలా పట్టించుకోలేనట్లున్నారు అని దీప బాధగా చెప్పింది.
అయితే సౌందర్య దీపతో ఏకీభవించకుండా.. కార్తీక్ మారడానికి సిద్ధపడే ఉంటాడు.. వాడిలో అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది… కానీ అసలు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావట్లేదు’ అంటుంది బాధగా.
అయితే దీప నాకు నమ్మకం అనే పదం మీదనే నమ్మకంపోయింది అత్తయ్య .. ప్రాణం పోయినా శీలానికి విలువనిచ్చే స్త్రీ గురించి ఎలా తప్పుగా ఆలోచిస్తారు ఈ మగవాళ్లు.. చివరికి నా సవతి తల్లి కూడా నా పవిత్రతను అంతెత్తున నిలబెట్టింది. మనిషే కదా మారతాడు అనుకున్నాను.. మనసే కదా.. కరుగుతుందిలే అనుకున్నాను.. కానీ అబద్దాన్ని ప్రేమించినంతగా నిజాన్ని ప్రేమించట్లేదు.. ఇక ఈ మార్గం కూడా మూసేసినట్లే అత్తయ్యా.. నావైపు నిలబడి పోరాడీ పోరాడీ అలసిపోయారు.. వదిలేయండని దీప తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది.
దీప నువ్వు నమ్మకాన్ని కోల్పోకు నీలో శక్తిని తక్కువ అంచనా వెయ్యకు.. ఓర్పు సహనంగా ఉండు అదే నిన్ను నిలబెడుతుంది. అని దైర్యం చెబుతుంది. ఇక తనకు సహనం లేదని.. సహనం చచ్చిపోయింది. ఆత్మాభిమానం చచ్చిపోయింది.. తన వల్లకావడం లేదు ఇంక పోరాడలేను అని చెప్పింది. దేనికి సౌందర్య నువ్వు నిజాన్ని నిరూపించుకునే సాక్ష్యం నీ కళ్ళ ముందే ఉంది. నువ్వు ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన పని లేదు.. అంతా చెప్పు.. తులసి చెప్పిందంతా చెప్పు.. వినకపోతే తులసి దగ్గరకు తీసుకుని వెళ్లి మరీ అంతా చెప్పించు..
కార్తీక్ ఇంటికి వచ్చే ఉంటాడు.. నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు.. అప్పుడు మేము అంతా గుడికి వెళ్తాము… మీరు ఇద్దరే ఉంటారు.. నిజాన్ని నిర్భయంగా నిజాయతీగా చెప్పు అని సౌందర్య దీపని ఓదార్చుస్తుంది.
తెల్లవారేసరికి కార్తీక పక్కన పిల్లలు ఉండరు.. సౌందర్య కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. వాయిస్ మెసేజ్ చేసేశాను చూసుకో అని పెట్టేస్తుంది. మేము దీపుతో సహా అందరం గుడి వచ్చాము. అని ఉంటుంది. దీని వెనుక కూడా ఏమైనా కుట్ర కోణం దాగుందా అని అనుకుంటూనే ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నా అనుకుంటాడు కార్తీక్.
దీప రెడీ అయ్యి దేవుడికి దణ్ణం పెట్టుకుని మోనిత మోపిన అపనిందలు చెరిపేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు సాయం చెయ్యాలి అంటూ దేవుడిని కోరుకుంటుంది. దీప కథలో మరో కార్తీకదీపం.. ముక్కోటి దేవతలు ఆశీర్వదించాలి అని దేవుడిని కోరుకుని కార్తీక్ దగ్గరకు బయలుదేరుతుంది. ఇంతలో కార్తీక్ కి మోనిత ఫోన్ చేసి తులసి విషయం అడుగుతుంది. తులసి లేదు.. టూలెట్ బోర్డు ఉంది అనగానే మోనిత సంబురంగా.. ‘అంటే అమెరికా వెళ్లిపోయిందా? అయితే బ్రేక్ ఫాస్ట్‌కి రా’ అంటుంది నవ్వుతూ. ‘
మా అమ్మ టిఫిన్ చేసి అంతా కలిసి గుడికి వెళ్లారు. అనడంతో మోనిత వెంటనే.. ‘నిన్నుఒక్కడ్ని వదిలేసి అందరూ గుడికి వెళ్లారా..? ఎందుకు? ఇవాళ విశేషమైన రోజు కూడా కాదే.. అందరూ కట్టుగట్టుకుని వెళ్లి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారంటే.. దీప కానీ ఇంటికి వస్తుందేమో.. మీ ఇద్దరికీ ఏకాంతం కలిపించడానికే ఈ ఏర్పాటు చేసి ఉంటారేమో.. ఈ టైమ్‌ని దీప బాగా యూజ్ చేసుకుంటుంది. ఎవ్వరూ లేని వేళ అంత పెద్దింట్లో భార్యాభర్తలు ఇద్దరే అంటూ కార్తీక్ కి మళ్ళీ నూరిపోస్తుంది.
మోనిత నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా.. అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అయితే సౌందర్యని నమ్మడానికి వీలులేదు.. ఏమైనా జరగొచ్చు.. కార్తీక్ నా మాటను కొట్టి పడేశాడు. దీప కార్తీక్ ను కలవడానికి వస్తే.. ఏం చెబుతుంది.. కార్తీక్ ఆ మాటలను వింటాడా పట్టించుకుంటాడా అంటూ టెన్షన్ గా ఆలోచిస్తుంది.. మరి కార్తీక్ మళ్ళీ మోనిత మాటకే విలువ ఇస్తాడా.. లేక దీప గోడు వింటాడా రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..
Also Read: