Harsingar Benefits: పారిజాతం ఆయుర్వేద వైద్యంలో అగ్రస్థానం.. ఔషధ ఉపయోగాలు, దుష్ప్రభావాలను తెలుసుకుందాం
పురాణాల్లో ప్రస్తావన ఉన్న వృక్షం పారిజాతం.. దీనిని శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించినట్లు పురాణాల కథనం. ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ..
Harsingar Benefits : పురాణాల్లో ప్రస్తావన ఉన్న వృక్షం పారిజాతం.. దీనిని శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించినట్లు పురాణాల కథనం. ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి, ఉదయం పూట తాను పూసిన పూలన్నింటినీ రాల్చివేస్తుంది. అందుకనే దీనిని “రాత్ కీ రాణి” గా పిలుస్తారు.పారిజాతం పొదరిల్లు దక్షిణ ఆసియాకు చెందినది. ఇది ఎక్కువుగా ఉత్తర భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు థాయ్లాండ్ ప్రాంతాలలో కనిపిస్తుంది. పారిజాతపుష్పం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారిక పుష్పం. పారిజాత పుష్పాలను హిందూ పండుగలలో దుర్గ మరియు విష్ణుదేవుడికి పూజా పుష్పాలుగా ఉపయోగిస్తారు. ఇక ఈ వృక్షానికి ఉన్న వివిధ వైద్యప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూలమొక్కకు అగ్రస్థానాన్నే ఇచ్చింది. దీని యొక్క వైద్యలక్షణాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం..!
పారిజాతం దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది: పారిజాత సారం శ్వాసనాళ కండరాలను వదులు చేస్తుంది. తద్వారా దగ్గు మరియు బ్రోన్కైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు తగ్గిస్తుంది మరియు వ్యాధికారక బ్యాక్టీరియాను చంపుతుంది ఇటీవలి అధ్యయనాలు పారిజాతం యొక్క యాంటిపైరెటిక్ చర్యను గురించి వెల్లడించాయి. ఇది సాంప్రదాయకంగా శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి మరియు జ్వరం నుండి ఉపశమనం కలిగించడానికి టి గా ఇస్తారు.
పారిజాత ఆకుల పేస్ట్, నోటి ద్వారా తీసుకున్నపుడు మలేరియా లక్షణాలను తగ్గించిందని.. శరీరంలో మలేరియా పరాన్నజీవి సంఖ్యను తగ్గించిందని క్లినికల్ అధ్యయనాలలో తేలింది. ఇది రక్త పప్లేట్లెట్లను అభివృద్ధి చేస్తుంది.
శారీరక మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి పారిజాత నూనెను పరిమళ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది మీ మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని నియంత్రించి, సంతోష భావనను కలిగిస్తుంది.
పారిజాతం అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ ని .. వరుస అధ్యయనాలలో వెల్లడైంది. పారిజాత సారాలు చాలా వ్యాధికారక బాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించగలవని కనుగొన్నాయి, అందువల్ల అంటువ్యాధులని నివారించవచ్చునని వైద్య నిపుణులు చెప్పారు.
పారిజాతం మొటిమలను నిరోధిస్తుంది . అంతేకాదు అకాలవృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. కీళ్ళనొప్పుల ఉపశమనం కోసం ఆయుర్వేద వైద్యులు పారిజాతం ఆకుల కషాయాలను సేవించాల్సిందిగా సూచిస్తారు.
ఒక ఇటీవల జంతువులపై జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, పారిజాతం యొక్క ఆకుల నుండి తీసిన రసం, తదితరాలు ఒక అద్భుతమైన నొప్పినివారణ ఔషధిగా పనిచేసిందని చెప్పారు.
ఆయుర్వేద వైద్యం మరియు జానపద ఔషధాలు పారిజాతాన్ని అత్యంత యాంటీమైక్రోబయాల్ గా గుర్తించాయి. రెండు వేర్వేరు అధ్యయనాలలో పారిజాతాన్ని అతి ఉత్తమంగా ఈ దిశలో ఎలా ఉపయోగించాలి అన్న విషయంపై పరిశోధకులు పరిశోధన జరిపారు. పారిజాత సారాన్ని వివిధ ద్రావణాలతో చేర్చి తయారు చేయబడిన మందును వివిధ రకాల సూక్ష్మ విషక్రిములపై ప్రయోగించగా పారిజాత రసంతో గూడిన ఆ మందులు సూక్ష్మ క్రిములపై ప్రభావం చూపాయి. వాటిని నశింపజేశాయి.
ఆయుర్వేదలో, పారిజాతం ఆకులు మరియు పువ్వుల నుండి తయారైన తేనీరు (కషాయం) ను దగ్గు, జలుబు మరియు విపరీతమైన బ్రోన్కైటిస్ జబ్బులకు ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.
పారిజాతాన్ని జ్వరాన్ని తగ్గించే ముందుగా సంప్రదాయికమైన వైద్యశాస్త్రంలో పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యులు దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడానికి పారిజాతం టీని సూచిస్తారు. పారిజాతం చెట్టు యొక్క బెరడు నుండి తీసిన సారం తదితర పదార్ధాలు జ్వరనివారిణిగా (యాంటిపైరేటిక్) ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఆయుర్వేద వైద్యం చాలా కాలం నుండి పారిజాతాన్ని ఉపయోగిస్తోంది. పారిజాతం యొక్క ఉత్ప్రేరకమైన రోగనిరోధక ప్రభావాల్ని పరీక్షించడానికి ప్రయోగశాల అధ్యయనాలు జరిగాయి.
షుగర్ వ్యాధి నివారణకు పారిజాతం ఆకులు ఓ మంచి మందు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు పారిజాతం ఆకులు ఉపయోగించబడుతున్నాయి. పారిజాతం చెట్టు పూలు నుండి తీసిన పదార్థాలు శక్తివంతమైన చక్కెరవ్యాధినిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయని జంతువులపై జరిపిన అధ్యయనాలు ద్వారా వెల్లడైంది.
సంప్రదాయ వైద్య పద్ధతుల్లో పుండ్లను నయం చేయగల ఔషధ గుణానికి పారిజాతం బాగా పేరు పొందింది. దీన్ని పైపూత మందుగా మరియు కడుపు లోనికి సేవించే మందుగా కూడా ఉపయోగిస్తారు. ఇంకా, విరిగిన ఎముకల చికిత్సలో కూడా పారిజాతాన్ని బాగా వాడుతున్నారు.
ఆయుర్వేదంలో పారిజాతాన్ని జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మందుగా ఉపయోగిస్తారు. పారిజాతం గింజలతో చేసిన కాషాయం లేదా టీ తలలోని చుండ్రు, వంటి వాటిని నివారణకు పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. పారిజాతం పువ్వులను కేశపుష్టి కోసం ఉపయోగించడమనేది సంప్రదాయికంగా వస్తోంది. మగువలు పొడవైన మరియు ఆరోగ్యకరమైన వెంట్రుకలు పొందడానికి పారిజాత పుష్పాల మందును సాంప్రదాయికంగా ఉపయోగిస్తున్నారు.
పారిజాతం దుష్ప్రభావాలు
అయితే ఈ పారిజాతం మెడిసిన్ ప్రయోజనాలపై పలు అధ్యయనాలు ఎక్కువుగా జంతువులపైనే జరిపారు.. మనుషులపై ఎక్కువుగా ప్రయోగాలు జరపకపోవడం వల్ల దీని యొక్క దుష్ప్రభావాలు ఏమిటో స్పష్టంగా తెలియదు. కనుక పారిజాతాన్ని సేవించే ముందు మీ శరీరం తీరు.. ఈ మొక్కకు సరిపడతాయో లేదో తెలుసుకోవాల్సి ఉంది. ఈ విషయం గురించి ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించి అప్పుడు పారిజాతాన్ని ఔషధంగా స్వీకరించడం మంచిది.
Also Read: