జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా వ్యాక్సిన్‌.. టీకా పట్ల అపోహలు అక్కరలేదన్న విజయలక్ష్మి

నగర ప్రజలంతా 45-60 వయసుగల వాళ్ళు షుగర్ బీపీ ఎలాంటి రుగ్మతలు ఉన్న వారైనా ఈ వ్యాక్సిన్ తీసుకోండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..

  • K Sammaiah
  • Publish Date - 4:28 pm, Tue, 2 March 21
జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా వ్యాక్సిన్‌.. టీకా పట్ల అపోహలు అక్కరలేదన్న విజయలక్ష్మి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో దశ విస్తురిస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా టీకా పంపిణీకి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో కోవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1005 గవర్నమెంట్ సెంటర్ లు మరీయ్ ప్రైవేట్ లో 231 సెంటర్ లు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఏర్పాటు చేశారని చెప్పారు.

నగర ప్రజలంతా 45-60 వయసుగల వాళ్ళు షుగర్ బీపీ ఎలాంటి రుగ్మతలు ఉన్న వారైనా ఈ వ్యాక్సిన్ తీసుకోండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎవరు బయపడకండి అని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. రోజుకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 20 వేళ మంది వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ కరోనా నిబంధనలు ఎప్పటిలాగే పాటించాలని మేయర్‌ అన్నారు. మాస్కులు ధరించడం మరవద్దన్నారు. వ్యాక్సిన్‌ కోసం గవర్నమెంట్ సెంటర్ లో ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని చెప్పారు. ప్రైవేట్ సెంటర్ లో 150 రూపాయలు వ్యాక్సిన్ చార్జెస్ మరియు 100 సర్వీస్ ఛార్జ్ ఉంటుందనిని మేయర్ అన్నారు

కాగా, దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని ప్రభుత్వం ఉధృతం చేసింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 60 ఏళ్ల వయసు పైబడిన వారికి మొదటి ప్రాధాన్యతగా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు టీకా తీసుకున్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి అపాయం లేదని సాధారణ ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ప్రజలు ప్రభుత్వ దవాఖానా లలోనే టీకా లు తీసుకోవాలి. ప్రజలు భరోసాగా ఉండాలని మంత్రులు చెబుతున్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కుటుంబంతో సహా వరంగల్‌ ఎంజీఎంలో టీకా తీసుకున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ దవాఖానలో నే టీకా లు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా సమయంలో ఎంజీఎం, గాంధీ వంటి ప్రభుత్వ దవాఖాన లలోనే మంచి వైద్యం అందించిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖాన లలో కావాల్సిన అన్ని టీకాలు అందుబాటులోనే ఉన్నాయని మంత్రులు తెలిపారు.

కాగా, 60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న దవాఖానల్లో టీకా వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింద‌ని, ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వారితోపాటు 45-59 ఇండ్లల్లో ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారని మంత్రి చెప్పారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు

Read More:

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి