- Telugu News Photo Gallery Political photos Priyanka gandhi vadra tries hand at plucking tea leaves in assam photos
తేయాకు కార్మికురాలిగా మారిన కాంగ్రెస్ నేత ప్రియాంక వైరల్ అవుతున్న ఫొటోస్ : Congress Priyanka Photos.
అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కనిపించారు.
Updated on: Mar 02, 2021 | 5:14 PM

అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కనిపించారు.

నుదుటికి బ్యాండ్ కట్టుకుని దానికి బ్యాలన్స్ చేస్తున్నట్టు తన వెనుక బుట్టను ఏర్పాటు చేసుకున్న ఆమె.. అందులో టీ ఆకులు వేస్తూ తోటి కార్మికులతో ముచ్చటిస్తూ వాచ్చారు. అలాగే నడుముకు ఏప్రాన్ ను కూడా ప్రియాంక కట్టుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ రాష్ట్రంలో నిన్న కూడా పర్యటించిన ప్రియాంక.. లఖింపూర్ లో గిరిజన యువతులతో కలిసి ఝముర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అస్సాంలో మార్చి 27 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్ర పర్యటనలో ప్రియాంక గాంధీ,, స్థానిక కస్టమ్స్ లో చురుకుగా కనిపిస్తూ..ప్రజలను ఆకట్టుకోగలిగారు.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి ప్రజలను ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.




