దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తొలి మోతాదు అందుకున్న ప్రముఖులు
దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి 1నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. కొవిన్ పోర్టల్, యాప్ లో లేదా ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది.

Covid 19 vaccine
- ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ అందుకున్న వారిలో హైదరాబాద్ నివాసి 100 ఏళ్ల జైదేవ్ చౌదరి కూడా ఉన్నారు. చౌదరి హైదరాబాద్ సెక్రటేరియట్ సమీపంలోని మెడికోవర్ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నారు.
- తమిళనాడు రాష్ట్రం చెన్నైలో భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తన మొదటి మోతాదు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారు.
- టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు మంగళవారం నిమ్స్ ఆసుపత్రిలో మొదటి మోతాదు కరోనా టీకా తీసుకున్నారు.
- కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదును కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అందుకున్నారు. న్యూ ఢిల్లీలోని ఢిల్లీ హార్ట్ &లంగ్ ఇనిస్టిట్యూట్‌లో అతనికి తొలి డోస్ అందించారు. ఆయనతో పాటు తన భార్యకు కూడా తొలి డోస్ వేయించారు.
- ముంబైలోని జెజె ఆసుపత్రిలో జాతీయవాద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను మొదటి మోతాదును తీసుకున్నారు.
- శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందుకున్నారు.
- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు అందుకున్నారు. న్యూ ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా మొదటి మోతాదు ఇచ్చారు వైద్య సిబ్బంది.
- ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ మంగళవారం చెన్నై నగరంలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
- భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను మొదటి మోతాదు అందుకున్నారు.













