AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మహమ్మారి ప్రాణాలను పట్టిపీడుస్తుంటే… ఇప్పుడు దేశంలోకి ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌..

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రాణాలను పట్టిపీడుస్తుంటే...ఇప్పుడు దేశంలో మరో కొత్త ముప్పు ఏర్పడింది. భారతీయుల్లో ఎక్కువ శాతం నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్..

కరోనా మహమ్మారి ప్రాణాలను పట్టిపీడుస్తుంటే... ఇప్పుడు దేశంలోకి ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌..
Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 8:03 PM

Share

Fatty Liver Disease:ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రాణాలను పట్టిపీడుస్తుంటే…ఇప్పుడు దేశంలో మరో కొత్త ముప్పు ఏర్పడింది. భారతీయుల్లో ఎక్కువ శాతం నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ బాధితులున్నట్లుగా సైంటిస్టులు గుర్తించారు. అంటే.. కాలేయంపై కొవ్వు నిల్వలు పెరగడం.

సాధారణంగా మద్యం తీసుకోవడం వల్ల కాలేయంపై కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. అయితే, మద్యం తీసుకునే అలవాటు లేకున్నా చాలామందిలో లీవర్‌పై ఫ్యాట్‌ పెరుగుతోంది.. గతి తప్పిన జీవనశైలి కారణంగానే ఈ పెనుముప్పు ఎదురవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం.. తదితర కారణాల వల్ల 9-32 శాతం మంది భారతీయుల్లో మద్యంతో సంబంధం లేకుండా కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయని గుర్తించారు.

అధిక రక్తపోటు(hypertension), మధుమేహం(diabetes), గుండెపోటు, పక్షవాతం(Paralysis), క్యాన్సర్‌(cancer) తరహాలోనే ‘కాలేయంపై కొవ్వు నిల్వలు’ పెరిగిపోవడాన్ని కూడా జీవనశైలి వ్యాధుల(నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌-ఎన్‌సీడీ) పరిధిలోకి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా తీసుకొచ్చింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తూ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

సాధారణ ప్రజల్లో 20-30 శాతం మంది ‘ఫ్యాటీ లివర్‌’ ఉన్నవారుంటారు. అయితే, ప్రమాదకర స్థాయిలో కొవ్వు పేరుకుపోతే అనారోగ్యం తీవ్రమవుతుంది. కాలేయ కణాలు దెబ్బతిని వాపు వస్తుంది. కాలేయం కుంచించుకుపోతుంది. క్యాన్సర్‌కూ దారితీస్తుంది. ఊబకాయానికి తోడుగా మధుమేహం ఉన్నవారిలో 40-80 శాతం మందిలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌’ ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తొలిదశలో వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. పొట్టకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లేదా సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేసినప్పుడే బయటపడుతుంది.

ఇందుకోసం ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు తప్పనిసరి చేసుకోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ అవసరం, బరువు తగ్గాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి. పురుషులు తమ నడుము చుట్టుకొలత 90 సెం.మీ కంటే ఎక్కువగా, మహిళలు 80 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

Vijay Hazare Trophy: దుమ్మురేపిన డొమెస్టిక్ ప్లేయర్.. వార్నర్ రికార్డు బ్రేక్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్..!