AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy: దుమ్మురేపిన డొమెస్టిక్ ప్లేయర్.. వార్నర్ రికార్డు బ్రేక్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్..!

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో డొమెస్టిక్ ప్లేయర్స్ దుమ్ము దులుపుతున్నారు. ఆకాశమే హద్దుగా పరుగుల వరద పారిస్తున్నారు....

Vijay Hazare Trophy: దుమ్మురేపిన డొమెస్టిక్ ప్లేయర్.. వార్నర్ రికార్డు బ్రేక్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్..!
Ravi Kiran
|

Updated on: Mar 02, 2021 | 7:01 PM

Share

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో డొమెస్టిక్ ప్లేయర్స్ దుమ్ము దులుపుతున్నారు. ఆకాశమే హద్దుగా పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. మొన్నటి మొన్న ముంబై కెప్టెన్ పృథ్వీ షా సునామీ సృష్టించగా.. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక పలువురు సీనియర్ ఆటగాళ్లు అయితే ఐపీఎల్‌లో సెలెక్ట్ అయ్యామన్న ఆనందమేమో సెంచరీల మీద సెంచరీలు బాదేశారు. ఈ కోవలోనే తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఎంపిక చేసుకున్న వెంకటేష్ అయ్యర్ చిన్న సైజ్ సునామీ సృష్టించాడు. 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులు చేసి.. రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.

ఆదివారం మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ పరుగుల వరద పారించాడు. మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 402 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 146 బంతుల్లో 198 పరుగులు చేశాడు. అతడికి ఆదిత్య శ్రీవాత్సవ(84*), రాజత్ పాటిదార్(54) తోడవ్వడంతో మధ్యప్రదేశ్ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 297 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లో కేవలం అభిషేక్ శర్మ(104) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. కాగా, కేకేఆర్ ఫ్రాంచైజీ వెంకటేష్ అయ్యర్‌ను రూ. 20 లక్షలు పెట్టి వేలం పాటలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు చేసిన ఈ అద్భుత  ఇన్నింగ్స్‌కు మొత్తం కేకేఆర్ డగౌట్‌లో ఉత్సాహాన్ని నింపింది.

డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేసిన అయ్యర్..

దేశవాళీ యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు పరుగులతో డబుల్ సెంచరీ మిస్ అయినా.. అతడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ లిస్ట్ -ఏ కెరీర్ రికార్డును మాత్రం బ్రేక్ చేశాడు. గతంలో డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న 197 పరుగుల రికార్డును వెంకటేష్ అయ్యర్ చెరిపేశాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..