కోడి గుడ్లు బాగా తింటున్నారా..! అయితే ఏ రకం గుడ్లు మంచివో తెలుసా.. అసలు నాటుకోడి గుడ్ల గురించి మీకు తెలుసా..?

Benefits of Eggs:ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తే ఓ రెండు ఉల్లిగడ్డలు, గుడ్డు కలిపితే

  • uppula Raju
  • Publish Date - 8:22 pm, Tue, 2 March 21
కోడి గుడ్లు బాగా తింటున్నారా..!  అయితే  ఏ రకం గుడ్లు మంచివో తెలుసా.. అసలు నాటుకోడి గుడ్ల గురించి మీకు తెలుసా..?

Benefits of Eggs:ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తే ఓ రెండు ఉల్లిగడ్డలు, గుడ్డు కలిపితే అద్భుతమైన విందుభోజనం చిటికలో వడ్డించొచ్చు. సంపూర్ణ ఆహారంలో గుడ్డు కూడా ఓ భాగమే మరి. అందుకే గుడ్డు వెరీ గుడ్డు అనేది. అయితే ఇప్పటికి చాలా మంది నమ్మేది నాటుకోడి గుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి అని నమ్ముతారు. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఎందుకు అనుకుంటున్నారా…? అయితే వినండి.

చాలామంది నాటు కోడి గుడ్డు మంచిదా లేక బ్రౌన్ కోడి గుడ్డు మంచిదా అంటే టక్కున నాటుకోడి గుడ్డు అని అనేస్తారు. ఐతే ఇది తప్పని పరిశోధకులు చెబుతున్నారు. బ్రౌన్, వైట్ రెండింటిలోనూ సమానమైన పోషకాలుంటాయని చెబుతున్నారు. తెలుపు రంగు గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, బ్రౌన్ గుడ్లలో కూడా అవే పోషకాలు ఉంటాయి. రెండింట్లో పెద్దగా తేడా ఉండదు. రంగు మాత్రమే తేడా అంతే అంటున్నారు పరిశోధకులు. రుచిలో కూడా కొంచెం తేడా ఉంటుంది తప్ప పోషకాల విలువలలో మాత్రం తేడా లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.

కేలరీలు, ప్రోటీన్స్‌, కొలెస్ట్రాల్ విషయంలో రెండు రకాల గుడ్లు ఒకటే. బ్రౌన్ ఎగ్స్ లో మాత్రం ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. గుడ్డుని తినడం వలన కండరాలు దృఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులుకు మంచి ఆహారం. గుడ్డులో ఉన్న రైబోఫ్లేవిన్ చర్మం ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. బ్రౌన్ ఎగ్స్ ని సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు కాబట్టి వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటారు. వైట్ ఎగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే అపోహ కూడా జనాల్లో ఉంది. అది తప్పని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక వేసవిలో దొరికే గుడ్లు కాస్త చిన్నవిగా ఉంటాయి. గుడ్డు యొక్క స్థితిని తెలుసుకోవాలంటే దాన్ని నీళ్లలో వేయాలి. ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని దాన్లో గుడ్డును వేసినప్పుడు అది నీటి అడుగుకు చేరితే తాజా గుడ్డుగా, నీళ్లల్లో తేలితే పాతదిగా గుర్తించవచ్చు. ఒకవేళ పాతది అని తెలిస్తే పారవేయాలి.. పూర్తిగా నీటిలో మునిగితేనే కోడిగుడ్డు మంచిది.

Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..