AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా…? వారి ఏడుపుల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయంటున్నారు చైల్డ్‌ సైకాలజీ నిపుణులు

పిల్లలు చిన్నతనంలో ఏడవడం అనేది మామూలే. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఏడుస్తుంటారు. కానీ వారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. వారి ఏడుపును మాన్పించేందుకు ఎన్ని..

పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా...? వారి ఏడుపుల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయంటున్నారు చైల్డ్‌ సైకాలజీ నిపుణులు
Subhash Goud
|

Updated on: Mar 02, 2021 | 11:01 PM

Share

పిల్లలు చిన్నతనంలో ఏడవడం అనేది మామూలే. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఏడుస్తుంటారు. కానీ వారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. వారి ఏడుపును మాన్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మానరు. వారు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పలేని పరిస్థితి. అయితే వారి ఏడుపులలో కూడా ఎన్నో రకాలు ఉంటాయని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అయితే పసి పిల్లలు రోజుకు మూడు గంటల పాటు ఏడుస్తారని చెబుతున్నారు. పిల్లలు అలా ఏడవడం వల్ల ప్రయోజనం కూడా ఉందంటున్నారు. అలా ఏడవడమే వారి భాషగా మారుతుందట. ఏడవడం ద్వారానే పిల్లలు వారికి కావాల్సినవి తెలియజేస్తారని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు ఏడవడం అనేదానిని బట్టి అర్థాలు ఉంటాయని చెబుతున్నారు. కానీ పిల్లలు ఏడుస్తున్నారంటే నిర్లక్ష్యం చేయకూడదని, వారి ఏడుపులను బట్టి వారికి ఏమవుతుందో తెలుసుకోవాలని అంటున్నారు.

ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు…

పిల్లలకు ఆకలిగా ఉన్న సమయంలో కొద్దిగా పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తారు. పిల్లలకు సౌకర్యంగా లేనప్పుడు తల్లిదండ్రులను సైతం హడలెత్తించి బిగ్గరగా ఏడుస్తూనే ఉంటారు. ఇలా విడవని ఏడుపునకు ఏ కడుపునొప్పో, చెవినొప్పో కారణం కావచ్చని, అలాంటి సమయంలో వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అందుకే పిల్లలకు ఎప్పుడు ముందుగా ఆకలి తీర్చిన తర్వాతే ఇంట్లో ఏవైనా పనులు చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే వారికి ఆకలి అవుతుందని నోటితో చెప్పలేరు కాబట్టి ముందుగా వారి ఆకలి తీర్చడం ముఖ్యం.

తల్లిదండ్రులను రప్పించుకోవాలనే భావనతో కూడా ఏడుస్తుంటారు..

పిల్లలకు ఏమి తోచక తల్లిదండ్రులు దగ్గరికి రావాలనే ఉద్దేశంతో కూడా ఏడుస్తుంటారట. అలా ఏడ్చేది తాపీగా మధ్య మధ్యలో అపుతూ ‘ఉ..ఊ’ అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టిన తల్లులు వెంటనే ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఎత్తుకుని ఆడించకుండా నాలుగైదు నిమిషాలు ఆగి వెళ్లాలి. లేకపోతే చంటి పిల్లలైనా అదే అలుసుగా తీసుకుని పదే పదే ఏడుస్తూనే ఉంటారని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏడుపుల్లో కూడా ఎన్నో కారణాలు :

పిల్లల ఏడుపుల్లో చాలా రకాలున్నాయంటున్నారు బాలల మనస్తత్వ నిపుణులు. పిల్లల ఏడుపును గమనించాల్సి ఉంటుంది. ఈ తేడాలను గుర్తించలేకపోయినా తల్లులు వెంటనే స్పందించి వారెందుకు ఏడుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ లాలిస్తే, తల్లి తనను కనిపెట్టుకునే ఉందనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు ఒకటి, రెండు నెలల నుంచే తల్లి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఏడ్చిన వెంటనే లాలిస్తూ, బుజ్జగిస్తూ.. సన్నగా పాట పాడుతూ నిద్రపోయేలా చేయాలి. సన్నగా సంగీతాన్ని వినిపించడం వల్ల కూడా పిల్లలు ఏడుపుమాని నిద్రలోకి జారుకుంటారు. అతిగా ఏడుస్తూ నిద్రపోని పిల్లలను వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి చదవండి :

Fruit Juices: సమ్మర్‌లో అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు

కోడి గుడ్లు బాగా తింటున్నారా..! అయితే ఏ రకం గుడ్లు మంచివో తెలుసా.. అసలు నాటుకోడి గుడ్ల గురించి మీకు తెలుసా..?