Jobs In ESIC: ఈఎస్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే.
Jobs In ESIC: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) భారీగా ఉద్యోగాల భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 6552 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సూచన ప్రాయంగా తెలిపిన సంస్థ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను..
Esic Recruitment 2021: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) భారీగా ఉద్యోగాల భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 6552 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సూచన ప్రాయంగా తెలిపిన సంస్థ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను మార్చి చివరిలో లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాల్సిందిగా సూచించింది.
ఖాళీల వివరాలు..
మొత్తం ఖాళీలు – 6552 అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ – 6306 స్టెనోగ్రఫీ – 246
విద్యార్హతలు..
స్టెనోగ్రఫీ – 12వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ – ఏదైనా అర్హత పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటాబేస్, ఆఫీస్ వంటి అంశాలపై కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు పరిమితి..
18 – 27 ఏళ్లు (ప్రభుత్వాలు నిర్ధేశించిన దాని ప్రకారం వయసులో సడలింపు ఇస్తారు)
ఎంపిక ప్రక్రియ..
అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ ఖాళీలను రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకోసం క్రమంతప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Also Read: SCCL Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 10వ తరగతి అర్హతతో సింగరేణి లో ఉద్యోగావకాశాలు