AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Wildlife Day 2021 : నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సం.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..!

ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి...

World Wildlife Day 2021 : నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సం.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..!
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 10:57 AM

Share

World Wildlife Day 2021 : ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వార్షిక వేడుక అయినప్పటికీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిరోజూ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇక ఈరోజును అటవీ వృక్ష జంతు సంతతి యొక్క విభిన్న రూపాలను సంరక్షించడానికి వచ్చిన అవకాశంగా జరుపుకుంటారు. ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందిస్తారు.

అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఈరోజున ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నాం.

అయితే రోజు రోజుకీ పెరుగుతున్న మానవ అవసరాలు వాతావరణ కాలుష్యం జీవ జాతులు, సహజ వనరులను జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఓ సర్వే అంచనా.. ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉన్నది. దీంతో మానవజాతి మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తేదీ ప్రాముఖ్యత :

1973 లో అంతరించిపోతున్న జాతుల వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా (CITES) లో అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందం మార్చి 3 న సంతకం చేశారు. అందువల్ల, డిసెంబర్ 20, 2013 న ప్రకటించిన 68 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA),నిర్వహించారు. వన్యప్రాణుల దినోత్సవం అనే ఆలోచనను థాయిలాండ్ ప్రతిపాదించింది. ప్రపంచ దేశాల్లో అక్రమంగా జరుగుతున్న వన్యప్రాణుల రవాణా వానాశనానికి దారితీస్తుంది. అందుకనే ప్రపంచ దేశాలు వాణిజ్య కార్యకలాపాలపై శ్రద్ద చూపాయి. ఈ ఇది తరచూ సభ్య దేశాలుగా వన్యప్రాణుల వినాశనానికి దారితీస్తుంది మరియు పర్యవేక్షణ సంస్థలు వేట మరియు వాణిజ్య కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతాయి. CITES కాంట్రాక్ట్ లో భారత దేశం కూడా సంతకం చేసింది.

వన్యప్రాణి సంరక్షణ కోసం రెండు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను.. అరుదైన వృక్షజాతిని కాపాడడం.. ఇక రెండవది వైవిధ్యమైన జంతులను సంరక్షించడం. ఇప్పటికే పలు దేశాలు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించాయి. భారతదేశం-పులి, ఆస్ట్రేలియా-కంగారు ఇలా తమ జాతీయ జంతువును ప్రకటించాయి.

ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి ఆధునిక పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడే అటవీప్రాంతాలు రానురాను కుచించుకుపోయి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దీంతో అరుదైన జీవ, జంతుజాలాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లూపొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతోంది. దుప్పిలు, అడవి పందులు, కుందేళ్ళు, నెమళ్ళు తదితర జంతుజాలాన్ని నిర్ధాక్షిణ్యంగా వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్‌ పెరగడంతో వాటిని భూస్వాములు, అధికారులకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పక్షుల వేట సరేసరి. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకించి కొన్ని జంతువులకు ప్రసిద్ధి. దేశంలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి, విద్య, పరిశోధనకోసం డెహ్రాడూన్‌లో 1987లో భారత అటవీ పరిశోధన, విద్యా మండలి స్థాపించారు.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2021:

ఈ సంవత్సరం ఈ రోజు అటవీ ఆధారిత జీవనోపాధి వేడుక అని యుఎన్ తెలిపింది. మానవ శ్రేయస్సు (సాంస్కృతిక మరియు ఆర్ధిక) కలుపుకొని అటవీ మరియు అటవీ వన్యప్రాణుల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం దీని లక్ష్యం. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అరుదైన జంతువులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

Also Read:

ప్రైవేట్ రంగంలో స్థానికులకు 75% రిజర్వేషన్స్, హర్యానా గవర్నర్ ఆమోదముద్ర

అందరి ముందు పెద్ద పంచాయతీ.. కార్తీక్ మూర్కుడు అని తేల్చేసిన తండ్రి.. ఉత్కంఠగా మారిన నేటి ఎపిసోడ్