JEE Main 2021: జేఈఈ అభ్యర్థులు అలర్ట్.. ప్రారంభమైన రెండో దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. చివరి తేది ఎప్పుడంటే..
JEE Main 2021: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) పలు ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021) మార్చి విడతకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
JEE Main 2021: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) పలు ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021) మార్చి విడతకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌లో అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)లో అందుబాటులో ఉంచారు. రెండో విడత పరీక్షకు హాజరుకావాలనుకుంటోన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీగా మార్చి 6ను ప్రకటించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు మార్చి 6ను గడువుగా విధించారు. ఇక రెండో విడతలో జరపనున్న ఈ పరీక్షలను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే 2021 నుంచి జేఈఈ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహిస్తున్నట్లు గతంలో విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపిన విషయం విధితమే. మార్చి/ఏప్రిల్/మేలో నిర్వహించనున్న ఈ పరీక్షను అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
* మొదటగా జేఈఈ మెయిన్ 2021 అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను ఓపెన్ చేయాలి. * అనంతరం “JEE Main March 2021 session- Fill registration form” లింక్‌పై క్లిక్ చేయాలి. * తర్వాత పేరు, విద్యార్హతలు లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. * పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాలి. * అనంతరం కేటాయించిన ఫీజును చెల్లించాలి. * కన్‌ఫర్మేషన్ పేజీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.