AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt Jobs: నల్గొండ బిడ్డ సత్తా.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!

సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల. డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు..

Telangana Govt Jobs: నల్గొండ బిడ్డ సత్తా.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!
Chintala Tulasi
Srilakshmi C
|

Updated on: Aug 06, 2024 | 7:58 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 6: సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల. డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు సాధించింది. ఇది వరకే ఆమె గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ కొలువులు సాధించిన తులసి.. ఏప్రిల్‌ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ ఉద్యోగాలకు సైతం ఎంపికైంది. చింతల వెంకన్న, లక్ష్మి దంపతుల మూడో సంతానం తులసి. స్వగ్రామలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించిన తులసి, జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్‌ పూర్తిచేసింది.

అనంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు సాధించింది. అయినా వాటితో సంతృప్తి చెందకుండా ఆ ఉద్యోగాలు వదులుకుని, ఉన్నత కొలువు కోసం అహర్నిశలు కష్టించింది. తాజాగా ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు తులసిని వరించాయి. దీనిపై తులసి మాట్లాడుతూ.. ఏఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. అయితే వేటికీ బెదరక ట్యూషన్లు చెప్పుకుంటూ.. వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నానని చెప్పుకొచ్చింది. ఎన్ని కష్టాలెదురైనా చదువు వదలకూడదని అమ్మానాన్న చెప్పిన మాటలే తనలో స్ఫూర్తి నింపాయని, వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రూప్‌-1 సాధించడమే తన లక్ష్యమని తులసి తెలిపింది.

స్కిల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా: సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. పెట్టుబడులే లక్ష్యంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు తెలిపారు. స్కిల్‌ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.