CGG Recruitment: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ఉద్యోగాలు.. తెలంగాణకు చెందిన వారు మాత్రమే అర్హులు..
CGG Recruitment: తెలంగాణ సమగ్ర శిక్ష పథకానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు...
CGG Recruitment: తెలంగాణ సమగ్ర శిక్ష పథకానికి చెందిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్నఖాళీలు అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో యంగ్ ప్రొఫెషనల్, మోనిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెషనల్, మేనేజర్(మీడియా & డాక్యుమెంటేషన్), ఫైనాన్స్ అసిస్టెంట్, టెక్నికల్ సివిల్ ఇంజినీర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంటర్ సీఏ, సీఏ/సీఎంఏ/ఎంకామ్/ఎంబీఏ(ఫైనాన్స్), సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుగులో రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 02-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
*పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?