CDAC Recruitment: సీడ్యాక్‌లో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
CDAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో..
CDAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 05 టెక్నికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు..
భర్తీ చేయనున్న ఉద్యోగాలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎంబెడెడ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, వెబ్ అండ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా (కంప్యూటర్ అప్లికేషన్స్), గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 12-12-2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 13-11-2021న ప్రారంభంకాగా, చివరి తేదీగా 12-12-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: VVS Laxman: ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ధృవీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..!
TRS: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు.. ఫైనల్ లిస్ట్‌లో ఆ ఇద్దరి పేర్లు..
Jagga Reddy: కాంగ్రెస్‌లో కొనసాగుతున్న హుజూరాబాద్ చిచ్చు.. రాష్ట్ర నేతలే కారణమంటున్న జగ్గారెడ్డి!