VVS Laxman: ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ధృవీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధృవీకరించినట్లు సమాచారం...
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధృవీకరించినట్లు సమాచారం. లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అని ఓ వార్త సంస్థ గంగూలీని సంప్రదించినప్పుడు అతను “అవును” అని బదులిచ్చాడని తెలుస్తుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆటను అభివృద్ధి చేయడంలో మాజీ క్రికెటర్లను భాగస్వామ్యం అవసరం చెప్పారు. BCCI అధ్యక్షుడిగా అతను రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా అంగీకరించేలా కృషి చేశాడు. బీసీసీఐ చీఫ్ మాత్రమే కాకుండా, సెక్రటరీ జే షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరారు. లక్ష్మణ్ NCA చీఫ్‌గా ఉండటానికి అంగీకరించాడని ఓ వార్త సంస్థకు బీసీసీఐ అధికారి తెలిపాడు.
ఈ బాధ్యతను నిర్వహించడానికి వీవీఎస్ లక్ష్మణ్ గతంలో నిరాకరించారు. అయితే ఆ తర్వాత బీసీసీఐని ఒప్పించడంతో అంగీకరించాడని సమాచారం. అయితే లక్ష్మణ్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం, ఇండియా A జట్టు దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత VVS లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టవచ్చు. ప్రధాన కోచ్‌గా తన నియామకంపై వ్యాఖ్యానించిన ద్రవిడ్ “భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమితులు కావడం గర్వకారణం, ఈ పాత్ర కోసం నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. శాస్త్రి ఆధ్వర్యంలో జట్టు చాలా బాగా పనిచేసింది. NCA, U19, ఇండియా A సెటప్‌లో చాలా మంది అబ్బాయిలతో సన్నిహితంగా పనిచేశానని, వారికి ప్రతిరోజూ మెరుగుపడాలనే కోరిక ఉందని నాకు తెలుసు.” అని చెప్పాడు.
Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.. రోహిత్ శర్మ ఎంపిక మంచి నిర్ణయం..