Daryl Mitchell: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన కాన్వే.. అతడి స్థానంలో డారిల్ మిచెల్‌కు చోటు..
న్యూజిలాండ్ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ టెస్టు జట్టులో డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ ఎంపికయ్యాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్లో కాన్వే చేయి విరిగింది...

న్యూజిలాండ్ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ టెస్టు జట్టులో డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ ఎంపికయ్యాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్లో కాన్వే చేయి విరిగింది. కాన్వే ఔటైన వెంటనే బ్యాట్‌తో చేయిని గట్టి కొట్టుకోవడంతో చేయి విరిగింది. దీంతో అతను ఐసీసీ T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ, కాన్వే ఇండియాతో మూడు టీ20ల మ్యాచ్‌ల తర్వాత T20 జట్టుతో స్వదేశానికి తిరిగి వస్తారని చెప్పారు.
“డారిల్ టెస్ట్ క్రికెట్‌లో రాణించగలడని నిరూపించాడు. అతను టెస్ట్ గ్రూప్‌లో తిరిగి చేరడానికి ఉత్సాహంగా ఉన్నాడని నాకు తెలుసు,” అని చెప్పాడు. మూడు టీ20 ఇంటర్నేషనల్‌లతో పర్యటనను ప్రారంభించేందుకు కివీస్ సోమవారం భారత్‌కు చేరుకోనుంది. అందులో మొదటిది టీ20 నవంబర్ 17న జైపూర్‌లో, 19న రెండో టీ20 రాంచీలో, 21న మూడో టీ20 కోల్‌కతాలో జరుగనుంది. రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 25న కాన్పూర్‌లో ప్రారంభంకాగా, డిసెంబర్ 3 నుంచి ముంబైలో రెండో టెస్టు జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ ఫైనల్ వెళ్లడానికి డారిల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై చెలరేగి ఆడాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ 37 బంతుల్లో 51 పరుగులు చేశాడు. డేవిడ్ మాలన్ 41 పరుగులు చేయగా జోస్ బట్లర్ 29 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో నీషమ్, సౌథీ, మిల్నే ఒక్కో వికెట్ తీశారు. 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు న్యూజిలాండ్ 9 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డారిల్ మిచెల్ 47 బంతుల్లో 72 పరుగులు చేశాడు. కాన్వే 46 పరుగులు చేయగా.. నీషమ్ 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్స్టాన్, ఓక్స్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఒక వికెట్ తీశారు.
Read Also.. AUS vs NZ Final: ఒకప్పుడు ఒకే జట్టులో ఆడారు.. ఇప్పుడు ఇతర జట్ల నుంచి పోటీ పడుతున్నారు..