AUS vs NZ Final: ఒకప్పుడు ఒకే జట్టులో ఆడారు.. ఇప్పుడు ఇతర జట్ల నుంచి పోటీ పడుతున్నారు..
నేడు రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఇరు జట్లలోని ఆటగాళ్లకు సంబంధంచిన ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది...
నేడు రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఇరు జట్లలోని ఆటగాళ్లకు సంబంధంచిన ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. అదేంటంటే.. ఆసీస్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్, కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్.. వీరిద్దరు పాఠశాల క్రికెట్లో ఒకే జట్టుకు ఆడేవారు. ఆ తర్వాత మంచి క్రికెటర్‌గా ఎదగాలనే కోరికతో వారు జట్టు నుంచి విడిపోయాయి. ఆస్ట్రేలియా ప్రస్తుత కోచ్ జస్టిన్ లాంగర్ 2009 స్కార్‌బరోస్‌కు ఫస్ట్-క్లాస్ ప్రీమియర్‌ను నిర్వహించారు. ఇందులో డారెల్ మిచెల్, మార్కస్ స్టోయినిస్ ఒకే జట్టులో కలిసి ఆడారు.
ఫస్ట్ క్లాస్ ప్రీమియర్‌లో మార్కస్ స్టోయినిస్, డారెల్ మిచెల్ సెమీ-ఫైనల్, ఫైనల్‌లో బ్యాట్, బాల్‌తో రాణించి. టైటిల్ అందించారు. సెమీ ఫైనల్‌లో స్టోయినిస్ 189 పరుగులు చేశాడు. మరోవైపు, మిచెల్ 26 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో స్కార్‌బరో బెజ్‌వాటర్-మోర్లీని ఓడించి ప్రీమియర్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. పాఠశాల జట్టును గెలిపించిన స్టోయినిస్, మిచెల్ ఈ రోజు రెండు వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు తరఫున మిచెల్, ఆసీస్ తరఫున స్టోయినిస్ బరిలోకి దిగనున్నారు.
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంలో డారెల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో 140 స్ట్రైక్ రేట్‌తో అతను 197 పరుగులు చేశాడు. అదే సమయంలో మార్కస్ స్టోయినిస్ 6 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 80 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో స్టోయినిస్ స్ట్రైక్ రేట్ 138గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో స్టోయినిస్ 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మొత్తంమీద T20 ప్రపంచ కప్ 2021లో స్టోయినిస్ కంటే మిచెల్ ప్రదర్శన బలంగా ఉంది. మరి ఈరోజు ఫైనల్‌లో ఎవరు ఎవరిని ఓడిస్తారో చూడాలి.