T20 World Cup 2021: మొదటి మ్యాచ్‌లో ఓడింది.. చివరికి ఫైనల్ చేరింది.. టీ20 వరల్డ్ కప్ 2021లో కివీస్ ప్రస్థానం
టీ20 ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరికి ఫైనల్‌కు చేరుకుంది. సూపర్ 12 తన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది...
టీ20 ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరికి ఫైనల్‌కు చేరుకుంది. సూపర్ 12 తన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కవీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ 20 బంతుల్లో 27 పరుగులు చయగా.. కన్వే 24 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. పాక్ బౌలర్లలో రవుఫ్ 4 వికెట్లు తీయగా.. హఫీజ్, అఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. 135 లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ రిజ్వాన్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అసిఫ్ అలీ 27, షోయబ్ మాలిక్ 26 పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో సోథి రెండు వికెట్ల తీయగా.. సౌథీ, బౌల్ట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. 111 పరుగుల విజయలక్ష్యంతో ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆ తర్వాత.. స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘానిస్తాన్ ఓడించిన కివీస్ గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ 37 బంతుల్లో 51 పరుగులు చేయగా.. మలాన్ 41 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో నీషమ్, సౌథీ, మిల్నే ఒక్కో వికెట్ తీశారు. 167 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్తప ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. గుప్తిల్, విలియమ్సన్ వెంటవెంటనే ఔటయ్యారు. కష్టాల్లో ఉన్న జట్టును కన్వే, మిచెల్ ఆదుకున్నారు.
అయినా కివీస్ మ్యాచ్ ఓడిపోయేలా కనిపించింది. కానీ నీషమ్ మ్యాచ్ గతినే మార్చేశాడు. 11 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును పోటీలోకి తెచ్చాడు. మిగతా పనిని మిచెల్ కానిచ్చాడు. దీంతో న్యూజిలాండ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే కివీస్ 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌ల్లో ఫైనల్ వరకు వెళ్లి బోల్తాకొట్టింది. మరి ఈసారైనా కప్ గెలుస్తోందో లేదో చూడాలి.