BSF Group C Recruitment 2021: బీఎస్ఎఫ్‌లో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
BSF Group C Recruitment 2021: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) గ్రూప్ C పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.
BSF Group C Recruitment 2021: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) గ్రూప్ C పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. కానిస్టేబుల్, ఇతర పోస్ట్‌ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు BSF అధికారిక సైట్ rectt.bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్స్ ప్రారంభమైన రోజు నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అంటే దరఖాస్తు గడువు 45 రోజులు అనమాట. ఈ పోస్టులకు అప్లికేషన్స్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ఖాళీ వివరాలు.. ASI : 1 పోస్టులు HC : 6 పోస్టులు కానిస్టేబుల్ : 65 పోస్టులు
అర్హతలు.. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండటంతో పాటు.. ITI సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ముగింపు తేదీ నాటికి పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు/ఆదేశాల ప్రకారం వివిధ వర్గాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
Also read:
Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్.. సిరి, షణ్ముఖ్‌లకు మెచ్చుకోలు..