BSF Recruitment: డిగ్రీ అర్హతతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

BSF Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వాటర్‌ వింగ్ విభాగం కింద...

BSF Recruitment: డిగ్రీ అర్హతతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Bsf Jobs
Follow us

|

Updated on: May 24, 2022 | 6:40 AM

BSF Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వాటర్‌ వింగ్ విభాగం కింద గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల ఆధారంగా పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 281 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో ఎస్‌ఐ (మాస్టర్‌), ఎస్‌ఐ (ఇంజిన్‌ డ్రైవర్‌), ఎస్‌ఐ (వర్క్‌షాప్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మాస్టర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్‌ డ్రైవర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్‌షాప్‌ ట్రేడ్‌), సీటీ క్రూ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పోస్టులను ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

* గ్రూప్‌బీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 200, గ్రూప్‌ సీ పోస్టులకు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్‌ చేయండి..