IBPS Recruitment: పీజీలో సైకాలజీ చేశారా.? బ్యాంకు కొలువు సొంతం చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు..

IBPS Recruitment: దేశంలోని బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసే సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో...

IBPS Recruitment: పీజీలో సైకాలజీ చేశారా.? బ్యాంకు కొలువు సొంతం చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు..
Follow us

|

Updated on: May 24, 2022 | 6:45 AM

IBPS Recruitment: దేశంలోని బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసే సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీలో సైకాలజీ, ఎడ్యుకేషన్‌, సైకలాజికల్‌ మెజర్‌మెంట్‌, సైకోమెట్రిక్స్‌, మేనేజ్‌మెంట్‌ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులకు మొదట ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు మే 31ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..