BEL Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ బెంగళూరు క్యాంపస్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

BEL Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Follow us

|

Updated on: May 24, 2022 | 6:30 AM

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ బెంగళూరు క్యాంపస్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ ఇంజనీరింగ్‌ (01), డిప్యూటీ ఇంజనీర్‌ (02) ఖాళీలు ఉన్నాయి.

* సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఈ/ ఎంటెక్‌ (మెకట్రానిక్స్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.

* డిప్యూటీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ సైబర్‌ సెక్యూరిటీలో ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ప్రొడక్షన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నవేషన్‌ సెంటర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, జలహళ్లి పోస్టు, బెంగళూరు-560013 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ఏడాదికి రూ. 12 నుంచి రూ. 14 లక్షలు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగాల వార్తల కోసం క్లిక్‌ చేయండి..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్