BHEL Recruitment 2023: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో 398 ట్రేడ్‌ అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 2023-24 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, కార్పెంటర్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 398 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు..

BHEL Recruitment 2023: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో 398 ట్రేడ్‌ అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే
BHEL Tiruchirappalli
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2023 | 7:56 AM

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 2023-24 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, కార్పెంటర్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 398 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఐటీఐలో ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి..

అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు నవంబర్‌ 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 1, 2023వ తేదీ రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్ష మార్కులు, అసెస్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ స్టాండర్డ్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అసెస్‌మెంట్ టెస్ట్ తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు.

విభాగాల వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు

  • ఏసీ మెకానిక్‌ ఖాళీలు: 5
  • కార్పెంటర్‌ ఖాళీలు: 3
  • ఎలక్ట్రీషియన్‌ ఖాళీలు: 36
  • ఫిట్టర్‌ ఖాళీలు: 178
  • ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ఖాళీలు: 9
  • మెషినిస్ట్‌ ఖాళీలు: 28
  • మసోన్‌ ఖాళీలు: 6
  • మోటర్‌ మెకానిక్‌ ఖాళీలు: 8
  • ప్లంబర్‌ ఖాళీలు: 2
  • టర్నర్‌ ఖాళీలు: 23
  • వెల్డర్‌ ఖాళీలు: 100

ముఖ్య తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 1, 2023.
  • పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: డిసెంబర్‌ 2, 2023.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.