Best Courses after MBA: ఎంబీఏ తర్వాత ఈ కోర్సులు చేస్తే.. భారీ ప్యాకేజీతో కొలువులు మీ సొంతం చేసుకోవచ్చు
MBA గ్రాడ్యుయేట్‌గా మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే సరైన ప్రణాళిక అవసరం. వృత్తిపరమైన ప్రయాణంలో ఎంబీయే తర్వాత ఏయే కోర్సులు తీసుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. మీ నైపుణ్యాలను మెరుగుపరచగల, వృద్ధికి కొత్త బాటలను వేయడానికి ప్రత్యేక కోర్సులను చేయాలి. అటువంటి వాటిలో.. డేటా సైన్స్, డేటా అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్, డిజిటల్ మార్కెటింగ్, SAP తో సహా వివిధ కోర్సులు..
MBA గ్రాడ్యుయేట్‌గా మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే సరైన ప్రణాళిక అవసరం. వృత్తిపరమైన ప్రయాణంలో ఎంబీయే తర్వాత ఏయే కోర్సులు తీసుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. మీ నైపుణ్యాలను మెరుగుపరచగల, వృద్ధికి కొత్త బాటలను వేయడానికి ప్రత్యేక కోర్సులను చేయాలి. అటువంటి వాటిలో.. డేటా సైన్స్, డేటా అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్, డిజిటల్ మార్కెటింగ్, SAP తో సహా వివిధ కోర్సులు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
డేటా సైన్స్
మోడ్రన్ బిజినెస్ స్ట్రాటజీలో డేటా సైన్స్ ముందంజలో ఉంది. డేటా సైన్స్ టెక్నిక్‌లలో మాస్టరింగ్ చేయడం ద్వారా అపార ఉపాది అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. నేటి డేటా-ఆధారిత యుగంలో నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులకు అధిక డిమాండ్ ఉంది. అందుకే డేటా సైన్స్ కోర్సులు MBA గ్రాడ్యుయేట్‌లకు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. పైథాన్ లేదా R వంటి ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం, గణాంక భావనలపై అవగాహన, డేటా మానిప్యులేషన్, విజువలైజేషన్ నైపుణ్యాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, బిగ్ డేటా టెక్నాలజీస్ నాలెడ్జ్ అవసరం. సగటు కోర్సు వ్యవధి 6 నుండి 12 నెలల వరకు ఉంటుంది.
డేటా అనలిస్ట్
వ్యాపార పనితీరును నడపడంలో, ఆప్టిమైజేషన్ కోసం అవకాశాలను గుర్తించడంలో డేటా విశ్లేషణ కీలక పాత్ర పోషిస్తుంది. మీ డేటా విశ్లేషణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగు పరచుకోవడానికి ఉపయోపడుతుంది. సంస్థలు పోటీతత్వాన్ని పొందేందుకు డేటాపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, డేటా విశ్లేషణలో ప్రావీణ్యం పొందితే MBA గ్రాడ్యుయేట్‌లకు అనేక రకాల కెరీర్ అవకాశాలు లభిస్తాయి. SQLలో నైపుణ్యం, పవర్ BI వంటి డేటా విజువలైజేషన్ టూల్స్, స్టాటిస్టికల్ మెథడ్స్‌పై అవగాహన, డేటా ఇన్‌సైట్స్ నేపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. సగటు కోర్సు వ్యవధి 4 నుండి 6 నెలల వరకు ఉంటుంది.
బిజినెస్ అనలిస్ట్
వ్యాపార లక్ష్యాలు, సాంకేతిక పరిష్కారాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో వ్యాపార విశ్లేషకులు కీలక పాత్ర పోషిస్తారు. వ్యాపార విశ్లేషణ నైపుణ్యాలను పొందడం ద్వారా , వ్యాపార అవసరాలను తేలిగ్గా గుర్తించగలరు. సమర్థవంతమైన పరిష్కారాలను సిఫార్సు చేయగలరు. విజయవంతమైన ప్రాజెక్ట్ ఫలితాలను సులభతరం చేయగలరు. అందుకు అద్భుతమైన కమ్యూనికేషన్, వ్యక్తుల మధ్య నైపుణ్యాలు, వ్యాపార ప్రక్రియలు, అవసరాల సేకరణపై అవగాహన, UML లేదా BPMN వంటి మోడలింగ్ టెక్నిక్‌లలో నైపుణ్యం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మెథడాలజీలపై అవగాహన, వ్యాపార అవసరాలను సాంకేతిక పరిష్కారాలలోకి అనువదించే సామర్థ్యం పెంపొందించుకోవాలి. సగటు కోర్సు వ్యవధి 4 నుండి 8 నెలల వరకు ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్
డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్‌లను మాస్టరింగ్ చేయడం ద్వారా, బ్రాండ్ అవగాహన, కస్టమర్ సముపార్జన, ఆదాయ వృద్ధిని పెంచే సమగ్ర మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవచ్చు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందువల్ల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం వల్ల మార్కెట్‌ప్లేస్‌లో పోటీతత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారు. SEO, SEM, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఇమెయిల్ మార్కెటింగ్‌తో సహా డిజిటల్ మార్కెటింగ్ ఛానెల్ నాలెడ్జ్, Google Analytics, AdWords వంటి సాధనాల్లో నైపుణ్యం, సృజనాత్మక ఆలోచన, ప్రచార పనితీరు మెట్రిక్‌లను విశ్లేషించే సామర్థ్యం నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సగటు కోర్సు వ్యవధి 3 నుండి 6 నెలల వరకు ఉంటుంది.
అలాగే SAP (సిస్టమ్‌లు, అప్లికేషన్‌లు అండ్ ప్రొడక్ట్స్) కోర్సు కూడా నేర్చుకోవచ్చు. ఇందుకు ఫైనాన్స్, సప్లై చైన్ లేదా హ్యూమన్ రిసోర్సెస్ వంటి వివిధ డొమైన్‌లలో వ్యాపార ప్రక్రియల అవగాహన, SAP మాడ్యూల్స్‌లో నైపుణ్యం ఉదాహరణకు SAP ERP, SAP CRM, SAP SCM, కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ స్కిల్స్ వంటి తదితర నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. సగటు కోర్సు వ్యవధి 2 నుండి 4 నెలల వరకు ఉంటుంది. MBA తర్వాత ఈ కోర్సులను నేర్చుకుంటే మీ నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.