TG Govt Schools: రాష్ట్రంలో జీరో స్టూడెంట్‌ బడులు 1,864.. విద్యాశాఖ లెక్కల్లో విస్తుగొలిపే వాస్తవాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విద్యార్థీ లేని బడులు 1,864 వరకు ఉన్నట్లు తేలింది. పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ సర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో 100 మంది విద్యార్థులు దాటినవి కేవలం 5,367 అంటే 20.41 శాతం మాత్రమే ఉండగా.. ఒక్క విద్యార్థి కూడా లేనివి 1,864 ఉన్నట్లు విద్యాశాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి..

TG Govt Schools: రాష్ట్రంలో జీరో స్టూడెంట్‌ బడులు 1,864.. విద్యాశాఖ లెక్కల్లో విస్తుగొలిపే వాస్తవాలు
TG Govt Schools
Follow us

|

Updated on: Sep 17, 2024 | 9:31 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విద్యార్థీ లేని బడులు 1,864 వరకు ఉన్నట్లు తేలింది. పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ సర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో 100 మంది విద్యార్థులు దాటినవి కేవలం 5,367 అంటే 20.41 శాతం మాత్రమే ఉండగా.. ఒక్క విద్యార్థి కూడా లేనివి 1,864 ఉన్నట్లు విద్యాశాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించిన విషయం తెలిసిందే.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఈ నిధులను జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు (డీఎంఎఫ్‌టీ) పద్దు నుంచి విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో జిల్లాల వారీగా పాఠశాలలు, వాటిల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను విద్యాశాఖ రూపొందించింది. దీనిని గనుల శాఖకు అందజేసింది. ఆ ప్రకారం డీఎంఎఫ్‌టీ కింద మూడు నెలలకు అవసరమైన రూ.40.83 కోట్లు విడుదల చేయాలని సింగరేణి సీఎండీకి గనుల శాఖ సంచాలకుడు బీఆర్‌వీ సుశీల్‌ కుమార్‌ లేఖ రాశారు.

అయితే విద్యార్థుల్లేని పాఠశాలలు పెరుగుతున్నాయా? అనే సందేహం ప్రభుత్వానికి వచ్చింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత సమావేశం కోసం గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేని పాఠశాలలు 1,213లు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ ఏడాది విద్యాశాఖ మరో సారి లెక్కలు తేల్చగా.. విద్యార్థులు లేని బడుల సంఖ్య మరింత పెరిగినట్లు తేలింది. దీనిని బట్టి చూస్తే ఏటేటా వాటి సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడంలేదా? లేదంటే ఆ పాఠశాలలున్న ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలు లేరా? అనే సందేహం కలుగుతుంది. దీనిపై అధికారులు విచారణ చేపబడితే గానీ అసలు విషయం తెలియరాదు. ఇలాగే వదిలేస్తే.. మునుముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు కరువవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాష్ట్రంలో జీరో స్టూడెంట్‌ బడులు 1,864.. విద్యాశాఖ నివేదిక
రాష్ట్రంలో జీరో స్టూడెంట్‌ బడులు 1,864.. విద్యాశాఖ నివేదిక
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
త్రివిక్రమ్ ఆలోచనకు సునీల్ షాక్.. అసలేం జరిగిందంటే..
త్రివిక్రమ్ ఆలోచనకు సునీల్ షాక్.. అసలేం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్.. ఎన్ని కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్.. ఎన్ని కోట్లు
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..
హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..
ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రీల్స్ కోసం చేసే ప్రయత్నం విరిగిన కాళ్లు ఒకరోజులో 2 కోట్ల వ్యూస్
రీల్స్ కోసం చేసే ప్రయత్నం విరిగిన కాళ్లు ఒకరోజులో 2 కోట్ల వ్యూస్
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!
విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!