AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ECILలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 437 ట్రేడ్‌ అప్రెంటిస్‌ షిప్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.? అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: ECILలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక
Ecil Jobs
Narender Vaitla
|

Updated on: Sep 17, 2024 | 10:11 AM

Share

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 437 ట్రేడ్‌ అప్రెంటిస్‌ షిప్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.? అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 437 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో యూఆర్‌-175, ఈడబ్ల్యూఎస్‌-44, ఓబీసీ-120, ఎస్‌సీ-65, ఎస్టీ 33 ఉన్నాయి. ఇక పోస్టుల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162, ఎలక్ట్రీషియన్- 70, ఫిట్టర్- 70, మెకానిక్ (ఆర్‌ అండ్‌ ఏసీ)- 17, టర్నర్- 17, మెషినిస్ట్- 17, మెషినిస్ట్(గ్రైండర్)- 13, సీఓపీఏ- 45, వెల్డర్- 22, పెయింటర్- 4 ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల29లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు 29వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.10.2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 30 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.

అభ్యర్థులను ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు. ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. 01 నవంబర్, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అంటే NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే