Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఉద్యోగాలు.. నెల జీతం రూ.78,230
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో పని చేయడానికి.. 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో పని చేయడానికి.. 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 100, ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు 300 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి
- ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు జులై 25, 2023వ తేదీ చివరి తేదీ. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీలకు చెందిన వారు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.118 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే..
ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు..
అన్ని స్థాయిల్లో నెగ్గి ఉద్యోగం పొందుకుంటే స్కేల్-3 పోస్టులకు నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతంగా చెల్లిస్తారు. స్కేల్-2 పోస్టులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.