Bank Of Maharashtra: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 500 ఖాళీలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Bank Of Maharashtra Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ బ్యాంకు పలు విభాగాల్లో ఉన్న 500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏ విభాగగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.?

Bank Of Maharashtra: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 500 ఖాళీలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Follow us

|

Updated on: Feb 08, 2022 | 11:41 AM

Bank Of Maharashtra Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఈ బ్యాంకు పలు విభాగాల్లో ఉన్న 500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏ విభాగగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌-2 (400), జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌-3 (100) ఖాళీలు ఉన్నాయి.

* ఆఫీసర్‌ స్కేల్‌-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.

* ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థ/లు రూ. 118, ఇతరులు రూ. 1180 ఫీజుగా చెల్లించాలి. పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 22-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పరీక్షను 12-03-2022న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి…

Also Read: Work From Home: ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించిన ఇ-కామర్స్‌ సంస్థ.. శాశ్వతంగా నచ్చిన చోటు నుంచి పనిచేసుకునే..

Viral Video: రోజూ తాగి వస్తున్న భర్తకు భార్య షాక్‌.! ఇంకోసారి తాగాలి అన్న ఆలోచన రాకుండా చేసిందిగా అంటున్న నెటిజన్లు..(వీడియో)

Boat Earbuds: బోట్‌ నుంచి అదిరిపోయే వైర్‌లెస్‌ బడ్స్‌.! తక్కువ ధరకే.. పూర్తి వివరాలు ఈ వీడియోలో…

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే