Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తోన్న గడువు..
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా కొన్ని..
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా కొన్ని పోస్టులను రెగ్యులర్/ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ మేనేజర్లు(27), మేనేజర్లు (04), హెడ్/డిప్యూటీ హెడ్ (11) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* రిస్క్ మేనేజ్‌మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే వారు సీఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 24 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 15-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Janasena: అమెరికాలో గ్రాండ్‌గా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. న్యూజెర్సీలో సందడే సందడి.
India-Russia: రష్యా ఇచ్చిన ఆఫర్‌కు భారత్ ఊ అంటే.. వాహనదారులు ఫుల్ ఖుషీ! ఆ ఆఫర్ ఏమిటంటే..
Srikalahasti: శ్రీకాళహస్తిలో నాగపడగల కొరత.. రాహుకేతు పూజకు అంతరాయం.. భక్తులు తీవ్ర ఆగ్రహం