Bank Jobs: బంధన్ బ్యాంకులో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..
Bandhan Bank Jobs: ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన బంధన్ బ్యాంకులో అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బంధన్ బ్యాంక్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగంలో ఉన్న ఖాళీలను...
Bandhan Bank Jobs: ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన బంధన్ బ్యాంకులో అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బంధన్ బ్యాంక్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 39 అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్స్‌తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28-02-2022 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్ అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14,200 నుంచి రూ. 20,100 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Viral Photo: నడిచే నెలవంక.. నగుమోము దాచావా కురుల వెనుక.. నిన్ను కనిపెట్టలేమా..?