Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath: నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది ఎంపిక పూర్తిగా ఆర్మీ పరిధిలోనే.. ఆ హక్కు ఎవ్వరికీ లేదు!

అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరే అభ్యర్ధులను నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నాలుగేళ్ల సర్వీసుకు ఎంపికైన వారిలో 25 శాతం మందిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా..

Agnipath: నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది ఎంపిక పూర్తిగా ఆర్మీ పరిధిలోనే.. ఆ హక్కు ఎవ్వరికీ లేదు!
Agnipath
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2022 | 1:49 PM

Army Announces First Agnipath Recruitment 2022: అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్‌పై నిరసనలు, అరెస్టులు కొనసాగుతున్నప్పటికీ ఇండియన్‌ ఆర్మీ సోమవారం (జూన్‌ 20) తొలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జులై నుంచి www.joinindianarmy.nic.in లో ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు నోటిఫికేషన్‌లో తెల్పింది. ఐతే అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరే అభ్యర్ధులను నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నాలుగేళ్ల సర్వీసుకు ఎంపికైన వారిలో 25 శాతం మందిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా ఆర్మీ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టంచేసింది. సర్వీస్‌ కాలంలో సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ కింది అర్హతలుండాలి..

  • జనరల్‌ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • క్లర్క్‌/స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌ పోస్టులకు ఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ఏ గ్రూప్‌ నుంచైనా 60 మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.
  • అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు 8వ తరగతి పాసై ఉండాలి.

మంత్రి మర్మగర్భంగా అన్న మాటలకు అర్థం ఇదే.. నాలుగేళ్ల తర్వాత వారి ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకుంటుంది. రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకున్నవారంతా 15 ఏళ్లు పనిచేయవల్సి ఉంటుంది. తమను ఖచ్చితంగా రెగ్యులర్‌ కేడర్‌లోకి తీసుకోవాలనికోరే హక్కు అగ్నివీరులకు ఉండదు. ఎవరిని రెగ్యులర్‌ చేయాలి, ఎవరిని తొలగించాలనే నిర్ణయం పూర్తిగా ఆర్మీకే ఉంటుంది. తొలగించిన అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ.. ఇతర సౌకర్యాలతోపాటు మాజీ సైనికోద్యోగి హోదా కూడా దక్కదు. ఐతే నాలుగేళ్ల తర్వాత నిర్భంద పదవీవిరమణ అనంతరం ఉద్యో్గాలు ఇస్తామంటూ కొందరు వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. అంటే ఆర్మీ నుంచి బయటికి వచ్చాక ఆయా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నమాట. అగ్నిపథ్‌ పథకం ద్వారా నియమితులైన వారు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోరని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మర్మగర్భంగా అన్న మాటలకు అర్థం ఇదేనన్నమాట.

ఇవి కూడా చదవండి

రైల్వే శాఖకు భారీ నష్టం.. అగ్నిపథ్‌ పథకాన్ని జూన్‌ 14న ప్రకటించినప్పటి నుంచి బీహార్‌తో ప్రారంభమయ్యి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరసలను వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ళ నుంచి రిక్రూట్‌మెంట్లు చేపట్టలేదు. ఈ ఏడాది రాబోయే నోటిఫికేషన్లపై యువత ఆశాలు పెట్టుకోగా కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టి నీళ్లు చల్లింది. గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు సడలింపు, 10 శాతం రిజర్వేషన్‌ ప్రకటించినప్పటికీ నిరసనలు మాత్రం తగ్గలేదు. కాగా అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌.. త్రివిధ దళాల్లో మొదటి ఏడాది దాదాపు 45,000 మంది అగ్నివీరులను నియమించాలనేది కేంద్రం నిర్ణయం. ఇదిలా ఉండగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారత్ బంద్ దృష్ట్యా సోమవారం 500 కి పైగా రైళ్లు రద్దయ్యాయి. గత వారం రోజులుగా చెలరేగుతున్న అల్లర్లతో రైల్వే శాఖ భారీ నష్టాన్ని చవిచూసింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.