APSCHE Admission Schedule 2023: ఐసెట్, పీజీసెట్‌తో సహా పలుసెట్ల ఎంట్రన్స్ టెస్ట్‌ల అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యామండలి నిర్వహించిన పలు ప్రవేశ పరీక్షలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రాధమిక షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలు జరిగి నెలలు గడుస్తున్నా ఫీజులు, ఇతర కారణాలతో కౌన్సెలింగ్ లో జాప్యం జరుగుతూ వస్తుంది.దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటివరకూ ఇంజినీరింగ్ కు సంబంధించి..
అమరావతి, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యామండలి నిర్వహించిన పలు ప్రవేశ పరీక్షలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రాధమిక షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలు జరిగి నెలలు గడుస్తున్నా ఫీజులు, ఇతర కారణాలతో కౌన్సెలింగ్ లో జాప్యం జరుగుతూ వస్తుంది.దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటివరకూ ఇంజినీరింగ్ కు సంబంధించి ఏపీఈఏపీసెట్ మొదటివిడత కౌన్సిలింగ్ మాత్రమే జరిగింది. ఇంజినీరింగ్ ఫీజుల వివాదం కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత హైకోర్టు సూచనల మేరకు ఫీజులు నిర్ధారించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు అధికారులు.
ఇక మిగిలిన పీజీ కోర్సులకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లు మే, జూన్ లోనే ముగిసాయి. ఆయా సెట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ మాత్రం జరగలేదు.ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఐసెట్ పరీక్ష నిర్వహించారు అధికారులు. ఎంఏ, ఎంఎస్సీ, ఎం, కాం కోర్సులకు జూన్ 6 నుంచి 10 వరకూ పరీక్షలు జరిగాయి. మే 31నుంచి పీఈసెట్, మే 20న లాసెట్ పరీక్షలు జరిగాయి. జూన్ 14న ఎడ్ సెట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసారు. మరోవైపు ఇంజినీరింగ్ కోర్సులకు మేనేజ్ మెంట్ కోటా అడ్మిషన్ల షెడ్యూల్ కూడా ప్రారంభమైనట్లు ఉన్నతవిద్యామండలి అధికారులు తెలిపారు.
వివిధ సెట్లకు సంబంధించిన అడ్మిషన్ల షెడ్యూల్ 2023 తేదీల వారీగా..
ఏపీ ఐసెట్ 2023 (ఎంబీఏ.ఎంసీఏ) – సెప్టెంబర్ 9 నుంచి ఏపీ పీజీసెట్ 2023 (ఎంఏ, ఎంఎస్సీ, ఎం.కాం) – సెప్టెంబర్ 11 నుంచి ఏపీ పీఈసెట్ 2023 (పీఎడ్, యూజీడీపీఎడ్) – సెప్టెంబర్ 17 నుంచి ఏపీ లాసెట్ 2023 (ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం) – సెప్టెంబర్ 30 నుంచి ఏపీ ఎడ్ సెట్ 2023 (బీఎడ్) – సెప్టెంబర్ 30 నుంచి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.