Hyderabd Drugs Case: డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ అరెస్ట్..!
డ్రగ్స్ కేసులో నగరంలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సైబర్‌క్రైమ్ ఎస్సై రాజేందర్‌ను పోలీసుల ఆదివారం (ఆగస్టు 27) అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పట్టివేతలో రాజేందర్ చేతివాటం ప్రదర్శించడమే అందుకు కారణం. పట్టుబడిన డ్రగ్స్‌లో కొంతమేర..
హైదరాబాద్, ఆగస్టు 27: డ్రగ్స్ కేసులో నగరంలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సైబర్‌క్రైమ్ ఎస్సై రాజేందర్‌ను పోలీసుల ఆదివారం (ఆగస్టు 27) అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పట్టివేతలో రాజేందర్ చేతివాటం ప్రదర్శించడమే అందుకు కారణం. పట్టుబడిన డ్రగ్స్‌లో కొంతమేర దాచి అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. ఉన్నతాధికారుల విచారణలో ఎస్సై అవినీతి బయటపడటంలో రాయదుర్గం పీఎస్‌లో రాజేందర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు ఎస్సై రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు.
కాగా నిందితుడు రాజేందర్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ స్వింగ్ ఆపరేషన్‌లో ఎస్సై రాజేందర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఈ వ్యవహరం తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగగా అసలు విషయం బయటపడింది. ఎస్‌ఐ రాజేందర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దాచిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి రాజేందర్ పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో బయపడింది.
ఎస్సై రాజేందర్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయి. ఓ కేసు విషయంలో రాజేందర్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో అధికారులు రాజేందర్‌ను సర్వీస్ నుంచి తొలగించగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.