APPSC Group 2 Mains 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. రేపట్నుంచి ఆ వివరాల నమోదుకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు జారీ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను ఇచ్చుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కోరింది. ఈ ప్రక్రియ జూన్ 5న ప్రారంభమవుతుందని, గ్రూప్ 2లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్ధులు ప్రాధాన్యతలను ఇచ్చుకోవాలని తన..
అమరావతి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు జారీ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను ఇచ్చుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కోరింది. ఈ ప్రక్రియ జూన్ 5న ప్రారంభమవుతుందని, గ్రూప్ 2లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్ధులు ప్రాధాన్యతలను ఇచ్చుకోవాలని తన ప్రకటనలో కమిషన్ కోరింది. వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జూన్ 18వ తేదీతో ముగుస్తుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్ వివరాల నమోదుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరచిన ప్రకనటనను పరిశీలించి.. ముందుగానే ఒక పేపర్ పై తమ ప్రాధాన్యాల వివరాలను రాసి పెట్టుకోవాలని, తద్వారా అప్‌లోడ్ చేసే సమయంలో సులువుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ప్రకటించిన విధంగానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జులై 28వ తేదీన రెండు సెషన్లలో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఎపీపీఎస్సీ స్పష్టం చేసింది.
కాగా మొత్తం 899 పోస్టుల భర్తీకై గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి. 1:100 నిష్ఫత్తిలో మెయిన్స్‌కు మొత్తం 92,250 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 18 వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్, జిల్లా ప్రిఫరెన్సులు సమర్పించాలని కమిషన్ సూచించింది. ఇక 2018లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో ఒక పోస్టుకు 12 మంది చొప్పున మెయిన్స్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈసారి ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వైఎస్ జగన్ సర్కార్ ఒక్కో పోస్టుకు 100 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది.