TG TET 2024 Result Date: తెలంగాణ టెట్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024)కు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు టెట్ ఆన్సర్ కీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి. కాగా తెలంగాణ టెట్ పరీక్షలు మే 20న ప్రారంభంకాగా జూన్ 2 వరకు కొనసాగాయి. పరీక్షలు ముగిసిన ఆ మరుసటి రోజే ప్రిలిమినరీ ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్స్‌ను కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు..
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024)కు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు టెట్ ఆన్సర్ కీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి. కాగా తెలంగాణ టెట్ పరీక్షలు మే 20న ప్రారంభంకాగా జూన్ 2 వరకు కొనసాగాయి. పరీక్షలు ముగిసిన ఆ మరుసటి రోజే ప్రిలిమినరీ ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్స్‌ను కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా ఆన్సర్ కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి, ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.
తెలంగాణ టెట్ 2024 ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ టెట్ 2024 రెస్పాన్స్‌షీట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ టెట్ 2024 కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఈసారి జరిగిన టెట్ పరీక్షలో పేపర్-1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. ఇక పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి.
టెట్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో యమ డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది. అందువల్లనే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్ధులు ప్రతీసారి టెట్ పరీక్షలో అధిక స్కోర్ సాధించేందుకు అధిక సంఖ్యలో పోటీపడుతుంటారు.