APPSC Group 2 Syllabus 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 సిలబస్ ఇదే.. ఈసారి కొత్తగా చేర్చిన సబ్జెక్ట్ ఏదంటే..

రాష్ట్రంలో 508 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నెల రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సన్నద్ధమయ్యే ఔత్సాహికులు ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ పై దృష్టి నిలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త సిలబస్ విడుదల చేసింది..

APPSC Group 2 Syllabus 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 సిలబస్ ఇదే.. ఈసారి కొత్తగా చేర్చిన సబ్జెక్ట్ ఏదంటే..
APPSC Group 2
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2023 | 3:50 PM

అమరావతి, ఆగస్టు 30: రాష్ట్రంలో 508 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నెల రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సన్నద్ధమయ్యే ఔత్సాహికులు ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ పై దృష్టి నిలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త సిలబస్ విడుదల చేసింది కూడా. మొత్తం 450 మార్కులకు గాను ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనుంది. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్‌ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఈ సారి ప్రిలిమ్స్‌ పరీక్షలో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష విధానం ఇదే..

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్)

ఈ పరీక్ష మొత్తం150 మార్కులకు 150 ప్రశ్నలకు ఉంటుంది.

  • భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు
  • భూగోళశాస్త్రం (జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు
  • భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం) విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు
  • కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ) విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష విధానం ఇలా..

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు 300 మార్కులకు 300 ప్రశ్నలకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలను అడుగుతారు.
  • పేపర్-2 లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలను అడుగుతారు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.