AP TET Results: ఆంధప్రదేశ్ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు వచ్చేశాయ్. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేశారు. ఫలితాలను శుక్రవారం పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది టెట్ పరీక్షలో...
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు వచ్చేశాయ్. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేశారు. ఫలితాలను శుక్రవారం పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది టెట్ పరీక్షలో 58.7 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఏటీ టెట్ 2022 పరీక్షకు మొత్తం 5,25,789 మంది అప్లై చేసుకోగా 4,07,329 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారు శుక్రవారం నుంచి తమ మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే నిజానికి తొలుత తెలిపిన సమాచారం ప్రకారం టెట్ ఫలితాలను సెప్టెంబ్ 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాలు వాయిదా పడ్డాయి. కేవలం ఫైనల్ కీని మాత్రమే విడుదల చేశారు. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు 21వ తేదీన ముగిశాయి. దాదాపు 4 ఏళ్ల తర్వాత టెట్ పరీక్షను నిర్వహించడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు ఏకంగా 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా పరీక్షను నిర్వహించారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో కనిపించే ఏపీ టెట్ రిజల్ట్స్ 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి.
* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
* భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..