Job News: యూపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు పొందడం ఇక మరింత సులభం.. ఫోన్ లోనే పూర్తి సమాచారం..
దేశ వ్యాప్తంగా వివిధ ఉద్యోగ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సీ) నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు యూపీఎస్సీ జారీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్లను సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్, వివిధ..
దేశ వ్యాప్తంగా వివిధ ఉద్యోగ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సీ) నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు యూపీఎస్సీ జారీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్లను సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్, వివిధ పత్రికల్లో ప్రకటన ద్వారా తెలియజేస్తూ వస్తోంది. తాజాగా యూపీఎస్సీ అధికారికంగా ఒక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి యూపీఎస్సీ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్ల సమాచారాన్ని మొబైల్ ఫోన్ లోనే పొందే వీలుంటుంది. ఈ యాప్ తో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసి మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ స్మార్ట్ ఫోన్ నుంచే నేరుగా యూపీఎస్సీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలు, నియామకాలకు సంబధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలను, ఖాళీల సమాచారాన్ని మాత్రమే పొందే వీలుంటుంది. అయితే యాప్ ద్వారా ఉద్యోగాలను దరఖాస్తు చేయడానికి అవకాశం లేదు. యూపీఎస్సీ ప్రకటన జారీచేసిన ఉద్యోగాలకు అన్ని అర్హతలు ఉంటే సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం యూపీఎస్సీ యాప్ ను విడుదల చేశామని సంస్థ తెలిపింది. అయితే ఈ యాప్ ఉపయోగించి ఎలాంటి దరఖాస్తులను నింపడానికి వీలులేదని యూపీఎస్సీ వెల్లడించింది. యూపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణతో పాటు అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అయితే యూపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ లేదా సంస్థ జారీచేసే ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలంటే యూపీఎస్సీ వెబ్ సైట్ ను సందర్శించాల్సి వచ్చేది. అయితే యూపీఎస్సీకి సంబంధించిన తాజా సమాచారం కోసం ఇక నుంచి సంస్థ వెబ్ సైట్ ను సందర్శించాల్సి అవసరం లేకుండా యూపీఎస్సీ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా సంస్థ జారీచేసే ఉద్యోగ ప్రకటనలకు సంబంధిచిన సమాచారాన్ని నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు.
మొబైల్ లో యూపీఎస్సీ ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనేకునే వారు మొదట గూగుల్ ప్లే స్టోర్ యాప్ ను ఓపెన్ చేసి యూపీఎస్సీ- అఫీషియల్ యాప్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్ స్టాల్ బటన్ పై క్లిక్ చేయాలి. మొబైల్ లో యాప్ ఇన్ స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి యూపీఎస్సీకి సంబంధించిన సమాచారాన్ని, ఉద్యోగ ప్రకటనల వివరాలను పొందవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.