APSLPRB: ఆగస్టు 25 నుంచి ఎస్సై అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్.. రేపట్నుంచి హాల్ టికెట్లు
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ప్రిలిమినరీ రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిటన్లు బోర్డు వెల్లడించింది. మొత్తం అభ్యర్ధుల్లో 49,386 మంది పురుషులు, 8,537 మహిళలు ఉన్నట్లు వెల్లడించింది...

అమరావతి, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్సై) పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు సోమవారం (ఆగస్టు 14) విడుదల కానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)లను బోర్డు నిర్వహిస్తుంది. ఈవెంట్స్‌ను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు.. నాలుగు కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్ 2 అప్లికేషన్ ఫాం తెచ్చుకోవాలని బోర్డు సూచించింది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ప్రిలిమినరీ రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిటన్లు బోర్డు వెల్లడించింది. మొత్తం అభ్యర్ధుల్లో 49,386 మంది పురుషులు, 8,537 మహిళలు ఉన్నట్లు వెల్లడించింది.
తెలంగాణ పీజీ వైద్య సీట్ల భర్తీకి నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద పీజీ వైద్య తొలివిడత ప్రవేశాలకు ఆగస్టు 13న ఉదయం 8 నుంచి ఆగస్టు 15వ తేదీ రాత్రి 8 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ తెలిపింది. నిమ్స్, కాళోజీ వర్సిటీ పరిధిలోని పీజీ వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన కింద భర్తీ చేస్తామని వివరించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.