AP RGUKT Admissions 2022-23: ఎట్టకేలకు ఏపీ ఆర్జీయూకేటీల్లో నిండిన ట్రిపుల్‌ఐటీ సీట్లు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..
ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో ఆదివారం (నవంబర్ 27) నూజివీడులో నిర్వహించిన నాలుగో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లన్నీ భర్తీ అయ్యినట్లు ఆర్జీయూకేటీ వీసీ..
ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో ఆదివారం (నవంబర్ 27) నూజివీడులో నిర్వహించిన నాలుగో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లన్నీ భర్తీ అయ్యినట్లు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ కేసీరెడ్డి తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్‌లో 121 జనరల్ కోటా, 20 స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశారు. ఎన్‌సీసీ, క్యాప్, ఓహెచ్ కోటా సీట్లను కూడా ఈ కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేశారు. దీంతో ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2022 – 23 విద్యా సంవత్సరానికి 4,400 సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అఖరి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గుర్తింపు కార్డులు సైతం అందజేశారు.
కాగా ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ఐఐఐటీ క్యాంపస్‌లలో 4,400 సీట్లు ఉండగా, మూడు సార్లు కౌన్సెలింగ్‌కు పిలిచినా కొన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ఎన్నడూలేనిది నాలుగోసారి కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణంగా ప్రతియేటా మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లన్నీ భర్తీ అయ్యేవి. మిగిలిన సీట్లకు రెండో విడతలో చేరిపోయేవారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.