AP POLYCET 2023: రేపే ఏపీ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష.. హాల్ టికెట్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష బుధవారం (మే 10) జరగనుంది. ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రభుత్వ, 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి వివిధ ట్రేడుల్లో అందుబాటులో ఉన్న 3,920 సీట్లలో పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు..
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష బుధవారం (మే 10) జరగనుంది. ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రభుత్వ, 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి వివిధ ట్రేడుల్లో అందుబాటులో ఉన్న 3,920 సీట్లలో పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 సెంటర్లలో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేశామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయ సారధి తెలిపారు. విజయవాడలో 10 కేంద్రాల్లో 4,566 మంది, తిరువూరులోని 7 కేంద్రాల్లో 1607 మంది, నందిగామలోని ఆరు కేంద్రాల్లో 1517 మంది కలిపి మొత్తం 7,690 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో బుధవారం ఉదయం 10 గంటలలోపే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభానికి ముందు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని పేర్కొన్నారు. ఇప్పటికే సాంకేతిక విద్య, రెవెన్యూ శాఖ, పోలీసులు, విద్యాశాఖ నుంచి పరిశీలకులుగా నియమించామని ఎం.విజయ సారధి వెల్లడించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.