AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Open School: ఏపీ ఓపెన్‌ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు.. పూర్తి వివరాలు

AP Open School: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్‌లో విద్యార్థుల అడ్మిషన్ గడువును పొడగించారు. ఏపీ ఓఎస్ఎస్ ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి..

AP Open School: ఏపీ ఓపెన్‌ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు.. పూర్తి వివరాలు
AP Open School
Janardhan Veluru
|

Updated on: Oct 16, 2021 | 10:03 AM

Share

AP Open School: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్‌లో విద్యార్థుల అడ్మిషన్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించారు. ఏపీ ఓఎస్ఎస్ ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి దూర విద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును ఈనెల 25 వరకు పొడగించారు. టెన్త్ లో చేరేందుకు 14 ఏళ్ల వయస్సు, ఇంటర్ లో ప్రవేశానికి టెన్త్ పూర్తి చేసి 15 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 27వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. అలాగే రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేందుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

ఏపీ ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయంతో పాటు apopenschool.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చని ఏపీ ఓఎస్ఎస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read..

Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..

Sleeping Tips: ఈ నాలుగు టిప్స్ తెలుసుకుంటే హ్యాపీగా.. కమ్మగా నిద్రపోతారు..