AP Inter Admissions 2023-24: జులై 15తో ముగియనున్న ఇంటర్‌ రెండో దశ అడ్మిషన్లు.. ఇంటర్ బోర్డు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్‌ రెండో దశ ఫస్టియర్‌ ప్రవేశాలు జులై 15తో ముగియనున్నాయి..

AP Inter Admissions 2023-24: జులై 15తో ముగియనున్న ఇంటర్‌ రెండో దశ అడ్మిషన్లు.. ఇంటర్ బోర్డు ఆదేశాలు
AP Inter board
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2023 | 2:02 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జులై 15తో ముగియనున్నాయి. రెండో విడత ప్రవేశాలను జులై 15లోపు పూర్తి చేయాలని యాజమాన్యాలకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదే తుది గడువని, మరోసారి పొడిగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు దశల్లో ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్‌ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభంకాగా, జూన్‌ 14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రవేశాలు జులై 15 వరకు కొనసాగుతాయి. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కల్పించేందుకే ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని, కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.